జగన్ మొదటి కాబినెట్ సమావేశం లో సంచలన నిర్ణయం ..ఒక బీర్ రూ..555
వైకాపా ప్రభుత్వ ఏర్పడి, జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక రాష్ట్ర మంత్రిమండలి తొలిసారిగా ఈరోజు సమావేశం కానుంది. ఉండవల్లిలో ఈ భేటీ జరగనుంది. ఇందులో ప్రధానమైన 8 అంశాలు చర్చకు రానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆయా శాఖల నుండి భేటీకి కావాల్సిన సమాచారాన్ని తెప్పించారు.ఈ సమావేశంలో ఆశా వర్కర్ల వేతనాలను 3000 నుండి 10,000లకు పెంచే అంశంపై కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అలాగే పింఛనును 2000 నుండి 250 చొప్పున పెంచుకుంటూ 3000లకు తీసుకెళ్లే నిర్ణయానికి కూడా ఆమోదం రానుంది. ఈ రెండు ప్రధాన అంశాలతో పాటు హోంగార్డుల జీతాలు పెంపు, రైతు భరోసా కింద రైతుకు ఏటా 12,500 చెల్లించే పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, సీపీఎస్ రద్దు, మున్సిపల్ కార్మికుల జీతాలు పెంపు అంశాలు చర్చకు రానున్నాయి.అంతే కాకుండా మధ్య పాన నిషేధం అమలులో భాగంగా మద్యం రేట్లు భాగా పెంచి వాటిని 5 స్టార్ హోటల్ కె పరిమితం చెయ్యాలి అనేది జగన్ మొదటి నుండి చెబుతున్న మాట ..ఈ విషయం పై తాజాగా తన మొదటి కాబినెట్ మీటింగ్ లో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ..ఒక బీర్ రేట్ సుమారు నాలుగు రేట్లు పెంచే విధంగా నిర్ణయం తీసుకున్నారు ..అంటే సుమారు 100 – 150 వుండే బీర్ దాదాపు 500 నుండి 550 వరకు ఉండబోతుంది అని అంచనా ..దీని వల్ల తాగేవారి సంఖ్యను క్రమంగా తగ్గించి చివరకు పూర్తి నిషేధం విద్జ్హించాలి అనేది ప్రభుత్వ ఆలోచన ..ఈ ఆలోచన పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం లో తెలియజేయాలండీ