ఢిల్లీ వీధుల్లో ప్రత్యేక హోదా డిమాండ్ ను హోరెత్తించిన వైసిపి. ఢిల్లీ పెద్దలను ఎదిరించటం కొత్త కాని జగన్..మరోసారి ఏపికి ప్రత్యే క హోదా కోసం హస్తిన వీధుల్లో కధం తొక్కారు. ఏపిలో కాదు..ఢిల్లీ వీధుల్లో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలంటూ టిడిపి తో పాటుగా అనేక మంది జగన్ పై విమర్శలు చేసారు. ఏ నిర్ణయం తీసుకున్నా..వెనుకడుగు వేయటం అలవాటు లేని జగన్ ఈ సారి కూడా పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశా నిర్ధేశం చేసారు. దీనికి అనుగుణంగా..ఢిల్లీ వీధుల్లో ఏపి ప్రజల బలమైన వాయిస్ గా నిలిచిన ప్రత్యేక హోదా డిమాండ్ ను వినిపించారు.
ప్యాకేజి వద్దు..హోదా ఏపి ప్రజల హక్కు అంటూ నినాదాల చేసారు. వైసిపి నేతలు పెద్ద ఎత్తున పాల్గొని హోదాకు మద్దతుగా నినాదాలు చేసారు. పార్టీ నేతలు శాంతి యుతంగా నిరసనలు చేసిన నేతలను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసారు. వైసిపి ఎంపీలను అరెస్ట్ చేసే సమయంలో వైసిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేవలం పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకని నినాదాలకే పరిమితమైన టిడిపి నేతలు వైసిపి నేతల పోరాటం చూసి విస్తుపోయారు. టిడిపి నేతల నాటకీయ నిరసనలు తేలిపోయాయి. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు కదలి వచ్చిన వైసిపి నేతలు మహా ధర్నా నిర్వహించి తమ చిత్తశుద్దితో ఏ విధంగా పోరాడుతుందీ నిరూపించారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభ రోజునే వ్యూహాత్మకంగా వామపక్ష నేతలతో సహా వైసిపి నేతలు చేసిన ధర్నా కేంద్రం దృష్టిని సైతం ఆకర్షించింది. వైసిపి ఢిల్లీ నడి వీధుల్లో హోరెత్తించిన ప్రత్యేక హోదా నినాదంతో టిడిపి పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఇక, అవిశ్వాస తీర్మానం…రాజీనామాల విషయంలోనూ వైసిపి నేతలు ఇదే దూకుడుతో ముందుకు వెళ్లనున్నారు