ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో అస్సలు ఎవరూ ఊహించని విధంగా ఇంకా చెప్పాలి అంటే వైసీపీ శ్రేణులు కూడా ఊహించని స్థాయి విజయాన్ని 2019 సార్వత్రిక ఎన్నికల్లో అందుకున్నారు. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు అలాగే 23 ఎంపీ స్థానాలు గెలుపొంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉండగా జగన్ ప్రమాణ స్వీకారానికి చాలా మంది రాజాకీయ నాయకులను మరియు ఇతర పార్టీల శ్రేణులతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఆహ్వానించగా ఆయన హాజరు కాలేదు. అలాగే అదే పార్టీకి చెందిన గంటా శ్రీనివాసరావు మారియు అచ్చెన్నాయుడులకు కూడా ఆహ్వానం పంపగా వారు కూడా ఎలాంటి స్పందనను తెలుపలేదు. దీనితో జగన్ గంటాకు ఊహించని షాకిచ్చారు అని ఇపుడు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
జగన్ ఆహ్వానించినపుడు వారు రాకపోగా అప్పటికే టచ్ లో ఉన్న కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు విషయంలో కూడా జగన్ కాస్త సీరియస్ గా ఉన్నారట. ఇదే సందర్భంలో జగన్ కు నామమాత్రంగా ఫోన్ లో శుభాకాంక్షలు తెలుపుదామని గంటా ఫోన్ చెయ్యగా అందుకు జగన్ అస్సలు ఆసక్తి చూపించకపోవడం మాత్రమే కాకుండా గంటాకు అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తెలుస్తుంది. దీనితో వైసీపీ శ్రేణులు జగన్ కు చిర్రెత్తుకొస్తే దాని ఫలితం ఇలాగే ఉంటుందని వారు అంటున్నారు.