రాజకీయంగా 40 ఏళ్లు అంటూ మద్దతు మీడియా ఊదర గొడుతున్న వేళ…చంద్రబాబు కు కొయ్యని కొరకగా మారాడు ప్రతి పక్ష నేత జగన్. వైసిపి అధినేత వ్యూహాలతో చంద్రబాబు పక్కాగా ఢిఫెన్స్‌లో పడిపోయారు. మరో రెండు రోజుల్లో పార్లమెంట్ రెండో విడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జగన్ ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో తాము అనుసరించబోయే వ్యూహం ఏంటో ఖరాఖండిగా చెప్పేసారు. తమ ఎంపీల రాజీనామాల తేదీని ప్రకటించేసారు.
జగన్ వ్యూహానికి ప్రతిగా టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నో మాటలు మార్చారు. ఎన్నో సమావేశాలు నిర్వహించారు. తాజాగా..పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు. పార్టీ ఎంపీలతో విడివిడిగా సమావేశమయ్యారు. కానీ, జగన్ కు ధీటుగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. జగన్ తన ఎంపీల రాజీనామాకు ఏప్రిల్ 6 డెడ్‌లైన్ గా పెట్టారు..మేమె అంతకంటే ముందుగానే రాజీనామాలు చేస్తామని మంత్రులు గతంలో ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఆ దిశగా నిర్ణయం అధికారికంగా తీసుకున్నట్లు కనిపించటం లేదు.
ఇక, వైసిపి అవిశ్వాసం నోటీసు తేదీ కూడా ప్రకటించింది. ఇప్పుడు అదే టిడిపికి పెద్ద సమస్యగా మారింది.ప్రజల్లో వైసిపికి మద్దతు పెరుగుతున్న అంశాన్ని గుర్తించిన టిడిపి చీఫ్..తిరిగి ప్రత్యేక హోదా అంశానికి మద్దతుగా పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ, పార్లమెంట్‌లో పోరాటం అనే మాట మినహా ఒత్తిడి పెంచే మరో నిర్ణయం ధైర్యంగా తీసుకోలేక పోతున్నారు. వైసిపి ఎంపీలు చెప్పిన విధంగా అవిశ్వాస నోటీసు ఇవ్వటానికి సిద్దమవుతున్నారు. మరి..పవన్ ఎంపీల మద్దతు కూడగట్టుగులుతారా…అంటే అదీ సందేహమే. వైసిపి నేరుగా కేంద్రం పై అవిశ్వాస నోటీసు ఇస్తే..టిడిపి అప్పుడు ఏం చేయాలో కూడా సరైన వ్యూహం నిర్ణయించుకోలేకపోతోంది. కేవలం కేసుల కోసమే జగన్ కేంద్రానికి వత్తాసు పలుకుతు న్నారని పదేపదే విమర్శలు చేసిన టిడిపి..ఇప్పుడు జగన్ దెబ్బతో మార్చి గండం నుండి ఎలా గట్టెక్కాలని తర్జన భర్జన పడుతోంది. పవన్ ది ఇదే పరిస్థితి. జగన్ ప్రకటించిన విధంగా..పార్లమెంట్ వేదిగా..వైసిపి ఎంపీలు తమ వ్యూహాలు పక్కాగా అమలు చేస్తే…ఏప్రిల్ 6 నాడు తీసుకొనే నిర్ణయం తో ఒక్కసారిగా జగన్ ఇమేజ్ అమాంతం పెరిగిపోవటం ఖాయం..