వైయస్ రాజారెడ్డి. వైయస్ రాజశేఖరెడ్డి. వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ ముగ్గురికి ఆ ముగ్గురే సాటి. వైయస్ ను మరిపించే విధంగా జగన్ ప్రజల్లో ఉన్నారు. తండ్రి వైయస్ తనయుడిగా ఆయన కంటే రెండడుగులు ముందుకు వెళ్తానని జగన్ పదే పదే చెబుతూ వస్తున్నారు.
ఇక, ఆ రియల్ హీరో గురించి 24 ఫ్రేమ్స్ మీదకు వస్తుంటే వారి పాత్ర ధారలు ఎవరనే ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే యాత్ర సినిమా ద్వారా వైయస్ జీవిత చరిత్ర కోసం షూటింగ్ జరుగుతోంది. వైయస్ గా తమిళ హీరో ముమ్ముట్టి చేస్తున్నారు. ఇక, వైయస్ తండ్రి రాజా రెడ్డి పాత్ర ఎవరినే దాని పైనా స్పష్టత వచ్చేసింది. రాజారెడ్డి పేరు చెబితే రాయలసీమలో తెలియని వారుండరంటే అతి శయోక్తి కాదు. ఇప్పుడు అటువంటి పాత్రలో విలక్షణ నటుడు జగపతిబాబు నటించనున్నారు. త్వరలోనే లుక్ టెస్ట్ చేయనున్నారు. ఇక, మిగిలిన పాత్రల్లో ఎవరెవరు నటిస్తున్నారో కొందరి పేర్లు బయటకు వచ్చాయి. షర్మిళ పాత్ర భూమిక చేస్తుందని చెబుతున్నారు. ఇక, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని నటిస్తున్నారు. ఒక, కర్నూలు జిల్లాలో వైయస్ కు ఆత్మీయులుగా ఉన్న ఒక కుటుం బం లోని మహిళ..ప్రస్తుత ఎమ్మెల్యే గా ఉన్న ఆ మహిళా నేత పాత్రలో జబర్దస్త్ ఫేమ్ అనసూయ నటించనున్నారు.
ఇక, అసలు పాత్ర అయిన జగన్ కోసం నిశితంగా పరిశీలిస్తున్నారు. జగన్ పాత్రపై అభిమానుల అంచనాలు ఎక్కువగా ఉంటాయని దానికి తగినట్లుగా పాత్రధారుడి ఎంపిక చేయాల్సి ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. దీని కోసం హీరో విశాల్ పేరు ప్రధానంగా ప్రచారంలో ఉంది. ఈ పేరుపై మరో వారంలో క్లారిటీ రానుంది. ఎన్నికలకు ముందు అటు ఎన్టీఆర్.. ఇటు వైయస్ బయోపిక్ లు ప్రజల ముందుకు రానున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పటికే కాంట్రావర్సీ అవుతోంది. యాత్రకు సంబంధించి నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఎన్నికల వేళ ఈ సినిమాలు ఎటువంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే