వైసిపి ఆ నిర్ణయం తీసుకుంటే టిడిపి కొత్త కుట్రకు సిద్దంగా ఉందా. అదే జరిగితే ప్రజలు సహిస్తారా. వైసిపి ఎమ్మెల్యేలు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసే ప్రతిపాదన పై చర్చ జరుగుతోంది. ఇప్పటికే వైసిపికి చెందిన ఎంపీలు రాజీనామా చేసారు. ఆమరణ దీక్ష చేసారు. తరువాతి కార్యాచరణ పై పార్టీ ఎంపీలతో అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ నెల 22న పార్టీ నేతల సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే వైసిపి ఎంపీల రాజీనామా తో ఢిఫెన్స్లో పడిన టిడిపి ఒక, రోజుకు విస్తృత పబ్లిసిటీ ద్వారా మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తోంది. అయితే, వైసిపి మాత్రం టిడిపి వైఖరి ఎలా ఉన్నా, ఎమ్మెల్యేలతో సైతం రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్లాలని అదే, సమయం లో కేంద్రం పైనా ఒత్తిడి పెంచాలని భావిస్తుంది.
వైసిసి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే టిడిపి ఎమ్మెల్యేలు ఇక ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడు తుంది. అయితే, వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, టిడిపి కొత్త ఎత్తుగడ ద్వారా వైసిపికి నష్టం చేసేలా నిర్ణయం తీసేకొనే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు వినిపిస్తోంది. వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయగానే వాటిని ఆమోదించి వైసిపి నుండి టిడిపి లోకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలతో తమదే అసలైన వైసిపి అంటూ స్పీకర్ లేఖ ఇప్పిస్తారని దాన్ని, వెంటనే స్పీకర్ ఆమోదిస్తారని. దీని ద్వారా వైసిపి గుర్తింపే సమస్యగా మారుతుందని ఆ చర్చ సారంశం. ఇప్పుడు రాజీనామాలు ఆమోదించినా ఎన్నికలు వచ్చే, అవకాశం లేకపోవటంతో టిడిపి, వైసిపి కి నష్టం చేసేలా ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం, ఉందనేది వాదన. అయితే, ప్రత్యేక హోదా కోసం వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సమయంలో టిడిపి ఇటువంటి రాజకీయాలు చేస్తే, ఇక ప్రజలు సహిస్తారా టిడిపిని క్షమిస్తారా.
అసలు, టిడిపి ప్రజలకు సమాధానం చెప్పుకో గలదా అనేది ఇప్పుడు ప్రశ్న. ఒక వైపు వైసిపి నేతలు హోదా కోసం పదవులు వీడితే టిడిపి ఇటువంటి రాజీకీయాలు చేస్తే రాజకీయంగా ప్రజల్లో భారీ డామేజ్ అవ్వటం తో పాటుగా వైసిపి కి విపరీతంగా సానుభూతి పెరగటానికి కారణమవుతా రనేది మరో అభిప్రాయం. ఫిరాయిం పు ఎమ్మెల్యేలు తమదే అసలైన వైసిపి అని స్పీకర్ కు లేఖ ఇస్తే, మరి అందులో మంత్రి పదవుల్లో కొనసాగుతున్న నలుగురు ఆ పదవుల్లో కొనసాగటానికి ఆర్హత ఉంటుందా. టిడిపి ఇటువంటి కుయుక్తులు పన్నితే ఇక్కడ, నిర్ణయం తీసుకున్నా ఎన్నికల సంఘం వారి గుర్తింపును ఆమోదిస్తుందా. పార్టీ గుర్తు వ్యవహారంలో ఇటు వంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎన్నికల సంఘం న్యాయస్థానాలు ఏం చెబుతున్నాయో గత తీర్పులే స్పష్టం చేస్తు న్నాయి. టిడిపి ప్రభుత్వం పై పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్న ఈ సమయంలో, కేంద్రం సైతం ఆగ్రహంగా ఉన్న పరిస్థితుల్లో టిడిపి అంత తెగింపు ప్రదర్శిస్తుందా.
ఇలాంటి, వెన్నుపోటు రాజకీయాలు చేస్తే, ఏపి ప్రజలు టిడిపి ని ఆదరించే పరిస్థితి ఉంటుందా. జగన్ పై అక్రమంగా కేసులు పెట్టిన సమయంలో జరిగిన ఎన్నికల్లో ప్రజల్లో ఉన్న సానుభూతి కారణంగా 18 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 15 స్థానాల్లో వైసిపి గెలిచింది. ఎంత మంది జత కట్టినా ఎంత విష ప్రచారం చేసినా, 2014 ఎన్నికల్లో వైసిపి ఓటమికి ఓట్ల తేడా కేవలం 1.95 శాతమే. ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా. ఇప్పుడు, ఏపి లో రాజకీయంగా ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్న టిడిపి ఇంతటి కుట్రకు దిగుతుందా అనే చర్చ సాగుతోంది. ఇటువంటి రాజకీయ చర్చ జరుగుతున్న సమయంలోనే ఏం జరిగినా, ముందుకే వెళ్లాలనేది వైసిపి ఆలోచన గా కనిపిస్తోంది. టిడిపి కుయుక్తులు పన్నుతుందన్న అంచనాల నడుమ వైసిపి ఎమ్మెల్యేల రాజీనామాలను ప్రస్తుతాని కి వాయిదా వేసుకుంటుందా. లేక, ముందుకే వెళ్లి ప్రజల్లోనే తేల్చుకోవటానికి సిద్దమవుతుందా అనేది చూడాలి.