దేశంలోనే తొలిసారిగా గ్రామ సచివాలయాలు

0
1013

అధికారం చేపట్టిన కేవలం నాలుగు నెలలు పూర్తికాక ముందే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్షరాలా లక్ష ముప్పై వేల శాశ్వత ఉద్యోగాలు కల్పించి రికార్డ్ సృష్టించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు పరిపాలనను చేరువ చేస్తున్నారు. మే 30న ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ గ్రామ సచివాలయాలు ఏర్పాటుకు పూనుకున్నారు. అతి తక్కువ సమయంలో లక్ష ముప్పై వేల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించడంతో పాటు నియామక ప్రక్రియ పూర్తిచేశారు. నియామక పత్రాలు అందుకున్న గ్రామ వాలంటీర్లు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విధుల్లో చేరనున్నారు.

ఎన్నికల సభల్లో సీఎం జగన్ హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది ప్రాధాన్యత అంశాలను నవరత్నాల పేరుతో మానిఫెస్టోలో చేర్చారు. వాటిని నవరత్నాలు అని పిలుస్తున్నారు. వీటిని పకడ్బందీగా అమలు చేయడానికి – ప్రతి లబ్ధిదారుడికి పథకాలు అందేందుకు గ్రామా వాలంటీర్లు కీలకం కానున్నారు. ఇందుకోసం ప్రభుత్వం భారీ ఎత్తున నియామకాలు చేపట్టింది. దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా – 8 రోజులపాటు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1.30 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు లభించాయి. తద్వారా ప్రతి గ్రామంలో 10 నుంచి 12 మందికి ఉద్యోగాలు లభించాయి. ఇంత భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డ్.

50 ఇళ్లకు ఒక వాలంటీర్:

వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకే గ్రామ – వార్డు సచివాలయాలు తీసుకువచ్చారు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటారు. వివక్ష – కుల మాత విభేదాలు లేకుండా అవినీతికి ఎలాంటి ఆస్కారం లేకుండా 72 గంటల్లో గ్రామ వాలంటీర్లు సేవలు అందిస్తారు. 34 డిపార్టుమెంట్లకు సంబందించిన పనులు గ్రామ సచివాలయాల ద్వారా జరుగుతాయి. పారదర్శకతతో అందరికి సంక్షేమ పథకాలు అందించడమే ఈ వ్యవస్థ ముఖ్య లక్ష్యం. నవరత్నాలతో పాటు మేనిఫేస్టోలో చెప్పిన అంశాలను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో గ్రామ సచివాలయాల పనితీరుపై తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్ నుండే పరిశీలించనున్నారు. ప్రతి సచివాలయంలో పదకొండు నుంచి పన్నెండు మంది ఉద్యోగులు పనిచేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా 126728 ఉద్యోగులతో కొత్త వ్యవస్థను సృష్టించడం వల్ల ప్రభుత్వ పథకాలు అర్హులకు ఇంటింటికీ చేరేలా పకడ్బంధీంగా జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 11158 గ్రామ సచివాలయాలు – 3786 వార్డు సచివాలయాలు గాంధీ జయంతి నాటి నుంచి ప్రారంభమవుతున్నాయి.

చంద్రబాబు అక్కసు:

ఒకప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా విపరీతమైన అవినీతికి పాల్పడ్డ తెలుగు దేశం నేతలు…జన్మభూమి కమిటీల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. అధికారం పోయినప్పటికీ చంద్రబాబు నైజం మారలేదు. ప్రభుత్వం ఒకవైపు గ్రామ వలంటీర్ల వ్యవస్థను సృష్టించి లక్షా 26వేల మందికిపైగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని టిడిపి అధినేత చంద్రబాబు ప్రతీనిమిషం తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు గ్రామ వాలంటీర్లు వెళ్లి డోర్లు కొడతారు అంటూ స్థాయిని తగ్గించుకొని వ్యాఖ్యలు చేశారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి నోటి తీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది. చంద్రబాబు అయిదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో నిరుద్యోగ భృతి – ఇంటికో ఉద్యోగం లాంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైంది.

అయిదేళ్ల అధికారంలో నిరుద్యోగ భృతి ఇవ్వకుండా – ఉద్యోగ కల్పన చేయకుండా చేతులెత్తేసిన చంద్రబాబు గ్రామ వలంటీర్ల వ్యక్తిత్వాలను కించపరుస్తూ మాట్లాడడం మహిళల శీలాలను శంకించే విధంగా దూషించడం మాజీ ముఖ్యమంత్రి రాజకీయ దుస్థితికి అద్దం పడుతోంది. అలాంటి చంద్రబాబు మహిళలను – గ్రామ వాలంటీర్లను కించపరుస్తూ మాట్లాడటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం లక్షా 25 వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడంతో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు బృందం కారుకూతలు కూస్తున్నారు.

ఒకవేళ పేపర్ లీకేజ్ అంటూ తప్పుడు ప్రచారాలను మొదలు పెట్టింది. నిజంగానే లీక్ అయ్యుంటే అది పరీక్షా జరిగిన రోజే బట్టబయలు అవుతుంది. ప్రజల్లో కూడా దానిపై వ్యతిరేకత ఆందోళన మొదలవుతాయి. ఫలితాలు వచ్చాక తన జాతి మీడియాతో చంద్రబాబు రాయించిన – కూయించిన పచ్చ పబ్లిసిటీ పనులు విజయవంతం కాలేదు. దీంతో గ్రామవాలంటీర్లు – సచివాలయ సిబ్బందిపై చంద్రబాబు అండ్ కో భవిష్యత్తులో ఎన్ని నిందలు వేయడానికైనా వెనుకాడరు. దేశంలో ఏ కొత్త విధానం/వ్యవస్థనైనా ప్రజలు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. అలాగే గ్రామ సచివాలయ – వలంటీర్ల పనితీరు ఫలితాలు రావడానికి కూడా ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. ప్రజలు ఆశీర్వదించి సొంతం చేసుకుంటే గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభమై దేశ వ్యాప్తంగా అమలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here