Home Blog

ఇక ప్రతి ఆటో పైనా జగన్ ఫోటో ఖాయమే..ఎందుకంటే..?

0
ఇక ప్రతి ఆటో పైనా జగన్ ఫోటో ఖాయమే..ఎందుకంటే..?

ఆటోవాలా.. ఎవరిపైనా ఆధారపడకుండా.. సాయం కోసం ప్రభుత్వం వైపు చూడకుండా.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. అందుకే ఇవి లక్షల మందికి స్వయం ఉపాధి సాధనాలు అయ్యాయి. అయితే వీటిలో చాలామందికి సొంత ఆటోలు ఉండవు. చాలా మంది లోను తీసుకుని ఆటోతీసుకుంటారు.

ఆటోల్లోనూ పోటీలు పెరగడంతో వీరికి పూటగడవడమే కష్టమైన సందర్భాలు ఉంటున్నాయి. ఈ సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల, లైసెన్స్‌ రెన్యూవల్‌, ఇన్సూరెన్స్‌, వాహనాల మరమ్మతులు.. ఇలా ఆటోవాలాలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అలాంటి ఆటో, కారు డ్రైవర్లకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆపన్న హస్తం అందించారు. ప్రజల కష్టాలు కళ్లారా చూసేందుకు పాదయాత్ర చేపట్టిన వైయస్‌ జగన్‌ ..ఆటో, కారుడ్రైవర్ల కష్టాలు చూసి చలించిపోయారు. తానున్నాని భరోసా ఇచ్చారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని కూడా నెరవేర్చారు. వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రారంభిస్తారు. దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆటో, క్యాబ్‌, కారు డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఉచితంగా అందించే బృహత్తర కార్యక్రమానికి ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుడతారు.

పాదయాత్రలో గతేడాది మే 14న ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 4 నెలలకే ఈ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలతో సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పథకాన్ని సంతృప్తకర స్థాయిలో అమలు చేసేందుకు బడ్జెట్‌లో రూ. 400 కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 312 కోట్లు ఇతర కులాలకు, రూ. 68 కోట్లు ఎస్సీలకు, రూ. 20 కోట్లు ఎస్టీలకు కేటాయించనుంది.

రైతు భరోసాకు నేటితో ముగియనున్న గడువు !

0
రైతు భరోసాకు నేటితో ముగియనున్న గడువు !

ఏ దశలోనైనా రైతు నష్టపోకూడదని,రైతుకు మేలు చేసేలా జగన్ కృషి చేస్తున్నారు.అంతేకాకుండా రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఈ విధానంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వైఎస్సార్ రైతు భరోసా పథకం అర్హుల జాబితా తయారీకి మరో రోజు మాత్రమే మిగిలిఉంది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం అర్హులైన రైతుల జాబితాను ఈ నెల 5న పంచాయతీల్లో ప్రదర్శించాలి. 7న రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితా 8న ప్రదర్శించాల్సివుంది.

కానీ, రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించాల్సిన రైతుల ఖాతాలు మాత్రం లక్షలో ఉన్నాయి, దీంతో ఏం చేయాలో తెలియ స్థితిలో అధికారయంత్రాంగం చిక్కుకుంది.వాస్తవానికి ఈ నెల మూడవ తేదినే ఈ ప్రక్రియ ముగియాల్సిఉంది. అర్హులైన రైతుల జాబితా సిద్ధం కాకపోవడంతో జిల్లా కలెక్టర్లు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతో 5వ తేదికి గడువు పెంచారు. అయినప్పటికీ జాబితా సిద్ధం కాలేదు.అయితే, అధికారిక సమాచారం ప్రకారం గురువారం సాయంత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా 59,69,897 రైతుల ఖాతాలను పరిశీంచాల్సివుంది. ఇంత పెద్ద మొత్తంలో పెండింగ్‌ ఉండటంతో నిర్దేశించిన సమయంలో పరిశీలన సాధ్యం కాదని చెబుతున్నారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 47,91,650 కుటుంబాలకు సంబంధించి 67,11,647 మంది రైతులున్నారు. గురువారం నాటికి గ్రామ స్థాయిలో విఆర్‌ఓ, వ్యవసాయ విస్తరణాధికారులు 17,11,990 మంది రైతుల ఖాతాలను పరిశీలించి అర్హమైనవిగా తేల్చారు. 3,37,283 ఖాతాలను అనర్హమైనవిగా గుర్తించారు. అర్హమైనవిగా తేలిన ఖాతాల్లో 12,84,629 ను అప్‌లోడ్‌ చేశారు. పూర్తిస్థాయిలో రైతుల ఖాతాలను పరిశీంచి అర్హుల జాబితా తయారు చేయకపోతే లక్షలాది మంది రైతులు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకానికి అర్హత కోల్పోనున్నారు. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలన్న డిమాండ్‌ రైతుల నుండి వినిపిస్తోంది

చంద్రబాబు దుబారా.. బయట పెట్టిన వైసీపీ సీనియర్ మంత్రి..?

0

40 ఏళ్ల సీనియర్ ను అని చెప్పుకునే చంద్రబాబు తన ఐదేళ్ల పాలన ద్వారా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన అవసరమైన చోట్ల ఖర్చు చేయకుండా దుబారా చేశారని మండిపడుతున్నారు. చంద్రబాబు అవినీతి, దుబారా ఖర్చులతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మున్సిపల్‌ శాఖలోనే రూ. 15 వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టారని మండిపడ్డారు.

సచివాలయంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్ల నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. ప్రచార ఆర్భాటాలకు చంద్రబాబు వందల కోట్ల రూపాయలను వృథా చేశారని, చంద్రబాబు తీరు వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కృషిచేస్తున్నారన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజారంజక పాలన చేస్తున్న మా ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు సరికాదని సూచించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక పాలసీ విధానంతో సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయి అన్నారు. సచివాలయాల ఆలోచన చంద్రబాబుకు వస్తే ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

అయితే వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మాటల్లో కొంత వరకూ వాస్తవం ఉండొచ్చు..కానీ ఈ మాటలు ఎక్కువ కాలం ప్రజలను ఆకట్టుకోలేవు.. చంద్రబాబు పాలన బాగా లేదనే కదా.. చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపింది.. ఇప్పుడు ఇక వైసీపీ పాలన వచ్చింది.

ఇకపై మీరు చేసేది ఏంటి.. మీ పాలన ఎంత బాగా వుంటుంది అనేదే ప్రజలు చూస్తారు. ప్రజలకు అల్టిమేట్ కావాల్సింది ఫలితాలు అంతే తప్ప.. విమర్శలు కాదు. కాబట్టి ఇక వైసీపీ మంత్రులు గత ప్రభుత్వాన్ని తప్పుబట్టే కార్యక్రమం కాస్త తగ్గించి.. తమ సామర్థ్యం చూపే పని ప్రారంభించాల్సిన సమయం వచ్చేసింది.

దమ్ముందా.. చంద్రబాబూ.. వైసీపీ లేడీ ఎమ్మెల్యే సవాల్..?

0

ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుకు.. వైసీపీకి చెందిన ఓ లేడీ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ప్రజా రంజక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచిపేరు రావడం చూసి ఓర్వలేక చంద్రబాబు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. గాంధీ జయంతి రోజున ప్రభుత్వం మద్యం అమ్మిందని చంద్రబాబు మాట్లాడారని, ఎక్కడ అమ్మకాలు జరిగాయో వచ్చి చూపట్టే దమ్ముందా అని సవాలు విసిరారు. ఇంతకీ ఆమె ఎవరంటారా.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని..

గత ఐదేళ్లు చేసిన మోసాలకు తెలుగుదేశం పార్టీని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. అయినా చంద్రబాబులో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. గాంధీ జయంతి రోజున చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, లేనిది ఉన్నట్లుగా ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గాంధీ 150వ జయంతిన ఆయనకు నివాళులర్పిస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఒక మంచి పరిపాలన, సిరిసంపదలు కలిగే గ్రామాల్లో సచివాలయాల వ్యవస్థను ప్రారంభించారన్నారు. సచివాలయ వ్యవస్థతో లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం తట్టుకోలేక చంద్రబాబు ప్రభుత్వంపై విషప్రచారం చేశారన్నారు.

అక్టోబర్‌ 2న మద్యం దుకాణాలు ఓపెన్‌ చేశారు. మద్యం పోలీసుల ద్వారా సరఫరా చేస్తున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. గాంధీజీవి సత్యం, అహింస మార్గాలు అయితే.. చంద్రబాబుది అసత్యం, హింసామార్గమని ఎమ్మెల్యే రజని అన్నారు. అక్టోబర్‌ 2 లాంటి పవిత్రమైన రోజును కూడా హేళన చేస్తూ మందు అమ్ముతున్నారని మాట్లాడిన చంద్రబాబును శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

‘అబద్ధమా.. అబద్ధమా నువ్వు ఎందుకు నవ్వుతున్నావంటే.. చంద్రబాబును చూసి నవ్వుతున్నానని చెప్పిందంట’ చంద్రబాబును చూసి అబద్ధం కూడా నవ్వే పరిస్థితి వచ్చిందన్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలోని 43 వేల బెల్టుషాపులు మూతపడ్డాయి. 40,380 పర్మిట్‌ రూంల లైసెన్స్‌లు కూడా రద్దయ్యాయి. దశలవారి మద్య నిషేధ పథకంలో భాగంగా 20 శాతం దుకాణాలను కూడా సీఎం తగ్గించారని గుర్తు చేశారు.

సీఎం జగన్ కు సర్‌ప్రైజ్ షాక్ ఇచ్చిన స్టూడెంట్స్..!

0

గాంధీ జయంతి రోజు గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవానికి తూర్పు గోదావరి జిల్లా కరప వెళ్లిన సీఎం వైఎస్జగన్ కు అక్కడి విద్యార్థులు సర్ ప్రైజ్ షాక్ ఇచ్చారు. ఇద్దరు విద్యార్థులు తమ టాలెంట్ తో ఏకంగా సీఎం జగన్ కు ఖుషీ చేసేశారు. ముఖ్యమంత్రి జగన్‌పై అభిమానంతో హర్షిత అనే విద్యార్థిని ఏకంగా 4.03 లక్షల ముత్యాలతో ఓ చిత్ర పటం రూపొందించింది. ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాలు పథకాల చిహ్నాలతో ఈ బొమ్మ రూపొందించింది

దాన్ని అక్కడ సీఎం జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇంకో విద్యార్థి సాయి కిరణ్.. జగన్ ప్రజా సంకల్పయాత్రకు సంబంధించిన పేపర్ క్లిప్పింగులు సేకరించి వాటితో సీఎం బొమ్మను రూపొందించాడు. ఇందు కోసం ఆ పిల్లవాడు ఏకంగా 2700 పేపర్‌ క్లిప్పింగ్స్‌ సేకరించాడు . హర్షిత, సాయికిరణ్ రూపొందించిన గిఫ్టులు చూసి సీఎం జగన్ ఫిదా అయ్యారు. వారిని మెచ్చుకున్నారు. వారితో ఫోటోలు కూ దిగారు.

కరపలో గ్రామ సచివాలయం ప్రారంభం ఆద్యంతం హుషారుగా సాగింది. సీఎం జగన్ అందరినీ పలకరించారు. అక్కడి ఉద్యోగులతో మమేకం అయ్యారు. ఉద్యోగుల ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. భుజం మీద చేయి వేసి మాట్లాడారు.. నేరుగా ముఖ్యమంత్రి తమ వద్దకు రావడం, అలా మాట్లాడడంతో ఉద్యోగులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇదే సమయంలో కొందరు పాదాభివందనం చేయబోగా.. సీఎం అడ్డుకున్నారు.

వారిని జగన్ తన దైన మార్కుతో తలపై చేయి వేసి దీవించారు. ఉద్యోగులతో కూడా గ్రూప్‌ ఫోటోలు దిగారు జగన్. గ్రామ సచివాలయాలను ప్రారంభించిన జగన్.. ఈ సచివాలయాల ద్వారా దాదాపు 500 సేవలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయన్నారు. ఇది దేశంలోనే ఓ చరిత్ర గా నిలిచిపోతుదని జగన్ అభిలషించారు.

ఇక ప్రతి గడపకూ.. జగన్ వరాలు చేరిపోతాయా..?

0

ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమైంది. దీంతో ఇక నవరత్నాలు అందరికీ అందుతాయంటున్నారు వైసీపీ నేతలు.. ప్రతి గడపకు నవరత్నాలు తీసుకెళ్లేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఓర్వలేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.

ప్రతి ఒక్కరూ సీఎం ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని పిలుపునిచ్చారు.గ్రామ స్వరాజ్య పాలనే లక్ష్యంగా గ్రామ సచివాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వార్డు సచివాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల్లో లక్ష 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. గతంలో పరిపాలన చూశామన్నారు. ఏదైనా సంక్షేమ పథకాలు కావాలంటే అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు.

వైఎస్‌ జగన్‌ 3468 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూశారని, ఈ వ్యవస్థను పటిష్టపరిచేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు. ఎన్నికల ప్రణాళికలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని చెప్పారు. నవరత్న పథకాలను గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా డోర్‌ డెలివరీ చేస్తామన్నారు.

గ్రామ సచివాలయ వ్యవస్థ ఓ మైలు రాయి అని మరో మంత్రి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిదే అని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులు నిజాయితీగా ప్రజలకు సేవలందించాలని సూచించారు. ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అయితే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఎంత బాగా పని చేస్తుందనే అంశంపైనే తుది ఫలితాలు ఆధాపపడి ఉంటాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

భూమా అఖిలప్రియ భర్తపై కేసు నమోదు..

0

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ పై కేసు నమోదయ్యింది. క్రషర్ ఇండస్ట్రీ పూర్తిగా తమకే ఇవ్వాలని భార్గవ్‌రామ్ వ్యాపార భాగస్వామిపై దాడికి పాల్పడిన ఘటనలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు. జిల్లాలోని దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి అనే వ్యక్తి ఆళ్లగడ్డ పట్టణ శివారులో శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ పేరుతో క్రషర్ ఫ్యాక్టరీ ఉంది.

ఇందులో అఖిలప్రియకు 40శాతం వాటా ఉంది. దీంతో పాటు మరో పరిశ్రమను కూడా శివరామిరెడ్డి నిర్వహిస్తున్నారు. అయితే ఆ పరిశ్రమలోని బాగస్వామిని ఇండస్ట్రీ మొత్తం వారికే ఇవ్వాలని బెదిరించారు. దీంతో అఖిల ప్రియపై కేసు నమోదయ్యింది. అయితే సరిగ్గా సంవత్సరం క్రితమే మాజీ మంత్రి అఖిల ప్రియకు భార్గవ్ రామ్ కు పెళ్లి అయ్యింది.

చంద్రబాబు నాయుడు హయంలో తల్లి శోభ నాగిరెడ్డి మృతితో ఎమ్మెల్యే అయినా అఖిల ప్రియా, తండ్రి భూమా నాగిరెడ్డి మృతితో అఖిల ప్రియా మంత్రి పదవి దక్కించుకుంది. ఈసారి 2019 ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా 2019 ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. ఓటమి అనంతరం రాజకీయాల్లో కనిపించని అఖిల ప్రియా మొన్న ఒకసారిలోకేష్ అన్నకు రాఖీ కట్టడానికి కనిపించి, నిన్న సేవ్ నల్లమల్ల అంటూ అప్పుడప్పుడు కనిపించారు.

జగన్ భగీరథ యత్నం కృష్ణా పై 3 బ్యారేజీలు

0
గ్రామ సచివాలయాల ప్రారంభానికి ముహూర్తం కుదిరింది....!!

కాళేశ్వరం మూడు ప్రాజెక్టులు కట్టి తెలంగాణ తాగు సాగు నీటి అవసరాలు తీరుస్తున్న కేసీఆర్ బాటలోనే నడిచేందుకు జగన్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం భారీ వరదలతో పులిచింతల దిగువన ప్రకాశం బ్యారేజీ కిందకు వందల టీఎంసీల నీరు వృథాగా పోయాయి.. పైగా సముద్రంలోని నీరు కూడా గోదావరిలోకి వచ్చి ఆ నీటితో డెల్టాలోని భూమి చౌడుబారుతోంది. వీటన్నింటిని చెక్ పెట్టడానికి ఇప్పుడు జగన్ భగీరథ యత్నానికి పూనుకుంటున్నారు.

ప్రస్తుతం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ చివరన ఏ ప్రాజెక్ట్ లేదు. దీంతో కృష్ణా నీరంతా సముద్రంలో కలుస్తోంది. అది రైతులకు ప్రజల తాగునీటికి ఉపయోగపడకుండా పోతోంది. అందుకే ఇప్పుడు పులిచింతల నుంచి సముద్రంలో కలిసే వరకూ కొత్తగా మూడు బ్యారేజీలు నిర్మించాలని జగన్ ఆదేశించారు.ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు డీపీఆర్ కోసం 8.78 కోట్లను కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్ కు జగన్ సర్కారు విడుదల చేసింది.

ప్రస్తుతం కృష్ణా నదిపై చోడవరం – గాజులలంక – ఓలేరు వద్ద మూడు బ్యారేజీల నిర్మాణం కోసం జగన్ సర్కారు డీపీఆర్ సిద్ధం చేస్తోంది. దీనివల్ల కృష్ణా గుంటూరు జిల్లాల్లో సాగు – తాగునీటి అవసరాలను తీర్చవచ్చని జగన్ సర్కారు యోచిస్తోంది. అంతేకాకుండా వరద వస్తే కింది జిల్లాలకు వరద నీటిని తరలించి సస్యశ్యామలం చేయాలని భావిస్తోంది. ఇక బ్యారేజీల వల్ల సముద్ర పు నీరు కృష్ణా నదిలోకి ఎగదన్నదని.. దానివల్ల కృష్ణ డెల్టా భూములు చౌడు భూములుగా మారకుండా రక్షించవచ్చని జగన్ ఈ మూడు బ్యారేజీల నిర్మాణానికి పూనుకున్నారు. బ్యారేజీల నిర్మాణంతో కృష్ణ గుంటూరు జిల్లాలో భూగర్భజలాలు భారీగా పెరుగుతాయని.. రైతులు లాభపడుతారని జగన్ ఈ భగీరథ ప్రయత్నానికి నడుం బిగించారు. పర్యాటక – జలరవాణాకు కూడా ఈ బ్యారేజీలతో సాధ్యం అవుతుందని ప్రణాళికలు రచిస్తున్నారు.

జనసేనకు మరో రాజీనామా..!

0

సార్వత్రిక ఎన్నికల అనంతరం జనసేన పార్టీ పరిస్థితి మరీ తీసికట్టుగా తయారవుతున్నట్టుగా ఉంది. ఎన్నికల సమయంలో కొందరు ఉత్సాహంతో, మరి కొందరు రాజకీయంపై ఆశలతో ఆ పార్టీలోకి చేరిపోయారు. అయితే ఎన్నికల్లో ఆ పార్టీ చతికిల పడటంతో.. అలాంటివారు చాలామంది నిస్పృహకు గురయ్యారు. ఎన్నికల తర్వాత కూడా పవన్ కల్యాణ్ తీరులో పెద్దగా మార్పులేదు.

ఆయన యథారీతిన చంద్రబాబు నాయుడి అడుగుజాడల్లోనే నడుస్తూ ఉన్నారని తేటతెల్లం అవుతూ ఉంది. దీంతో ఎన్నికల తర్వాత ఆయన బాధ్యతలు అప్పగించిన వారు కూడా పార్టీకి దూరం అవుతూ ఉన్నారు. జనసేనకు ప్రజాకర్షక నేతలు అనుకున్నవారు చాలామంది ఇప్పుడు చప్పుడు చేయడంలేదు. జనసేన తరఫున పోటీచేసిన, నిష్టాగరిష్టుడుగా బిల్డప్ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా ఇప్పుడు అడ్రస్ లేకుండాపోయారు.

అదలాఉంటే.. జనసేనకు పార్థసారథి అనే నేత రాజీనామా చేశారు. ఈయన ఎన్నికల్లో ఎంపీగా పోటీచేశారట. అలా ఓడిపోయిన వారు ఆ పార్టీకి దూరం కావడం విడ్డూరం ఏమీకాదు. అయితే ఈయనకు ఇటీవల కూడా పవన్ కల్యాణ్ బాధ్యతలు తప్పించారట. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై మానిటరింగ్ చేసి, పార్టీ తరఫున మాట్లాడే బాధ్యతలు ఈయనకు ఇచ్చారట పవన్ కల్యాణ్.

అయితే ఆయన ఆ బాధ్యతలు కూడా వద్దంటూ జనసేనకు రాజీనామా చేసినట్టుగా సమాచారం. ఇలాంటి వారు ఏ పార్టీలోకి చేరతారు అనేదాని కన్నా.. జనసేనకు ఒక్కొక్కరుగా దూరం అవుతూ ఉండటం మాత్రం గమనార్హం.

చరిత్ర ప్రారంభం.. జగన్ చేతుల మీదుగా ఆరంభం

0

అందరూ చరిత్రను చదువుతారు. కొందరు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు. సీఎం వైఎస్ జగన్ రెండో కేటగిరీలోకి వస్తారు. గ్రామ స్వరాజ్యం, ప్రజల సంక్షేమం దిశగా తాను కన్న కలను నిజం చేయడం కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ తలపెట్టిన ప్రతిష్టాత్మక గ్రామ సచివాలయాలు ఇవాళ్టి నుంచి కార్యాచరణలోకి వచ్చాయి.

ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవల్ని అందించడంతో పాటు, లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించే సమున్నత లక్ష్యంతో, ఎంతో ఆలోచించి జగన్ ప్రారంభించిన ఓ కొత్త ఒరవడి ఇది. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కలలో కూడా ఊహించని కాన్సెప్ట్ ఇది. ఇంకా చెప్పాలంటే ఇదొక చరిత్ర. ఆ చరిత్రలో మొదటి పేజీ ఈరోజే మొదలైంది.

గాంధీ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కరపలో గ్రామ సచివాలయాల కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్. ముందుగా 8 సేవలతో మొదలైన సచివాలయ కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో 500 సేవలకు విస్తరించనుంది. ఈ మేరకు 2020 జనవరి 1 నాటికి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.

గ్రామ/వార్డ్ సచివాలయాలతో మరిన్ని అక్రమాలు జరిగే ఆస్కారం ఉందంటూ ప్రతిపక్షం గగ్గోలు పెడుతున్న వేళ, ఆ దిశగా కూడా సీఎం తగు చర్యలు చేపట్టారు. అవినీతికి పాల్పడినట్టు తెలిసిన మరుక్షణం ఉద్యోగాలు పోతాయని కొత్తగా విధుల్లో చేరిన ఉద్యోగస్తులకు హెచ్చరించారు జగన్. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలు ఉండవని, తగినంత జీతం పొందడంతో పాటు పేదలకు సేవ చేసే అవకాశం నేరుగా లభించినందుకు అంతా గర్వంగా ఫీలవ్వాలని సూచించారు. మరోవైపు ప్రజలకు కూడా చైతన్య కలిగించేందుకు ఓ టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటుచేశారు. అవినీతి, అక్రమాలు జరిగినట్టు అనిపిస్తే 1902 నంబర్ కు ఫోన్ చేసి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడొచ్చని భరోసా ఇచ్చారు.

ఈ ఒక్కరోజే 1,34,978 మంది విధుల్లో చేరారు. ఏడాది చివరినాటికి మిగిలిన ఖాళీల్ని కూడా భర్తీ చేయబోతున్నారు. ఇది చరిత్రలో తొలి అడుగు మాత్రమే. ఇది విప్లవానికి ఆరంభం మాత్రమే. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసిన జగన్.. ఇకపై ఇదే తరహా విప్లవాన్ని మిగతా అన్ని రంగాలకు విస్తరించబోతున్నారు. ఇదే నెలలో వైఎస్ఆర్ రైతుభరోసా కార్యక్రమం అమలుకాబోతోంది. త్వరలోనే అమ్మఒడి కార్యక్రమం అమలవుతుంది. ఉగాదికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందబోతున్నాయి. ఇలా జగన్ పాలన చరిత్రలో నిలిచిపోనుంది. దానికి ఏపీ ప్రజలు సాక్ష్యంగా నిలవబోతున్నారు.