ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి నాయకులు జంప్ అవుతుంటారు. అందరికంటే ముందుగా జంప్ అయ్యేది ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యేలు. ఎందుకంటే ప్రతిపక్షంలో కూర్చుంటే వారికి పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. అందుకే ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యేలు ముందుగా జంప్ అవుతుంటారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఆకర్ష్ ను చేస్తే ఇప్పుడు జగన్ గెలిచిన తరువాత ఈ ఆపరేషన్ ను స్టార్ట్ చేశారు.
వైకాపాకు రాయలసీమలో మంచి పట్టు ఉంది. రాయలసీమ నుంచే ఆపరేషన్ ను ప్రారంభించాలని చూస్తోంది. కర్నూలు జిల్లా నుంచి ఈ ఆపరేషన్ పథకాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. కర్నూలు జిల్లాకు చెందిన కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు జంప్ కావాలని చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది వైకాపాలోకి చేరిపోయారు. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, కెఈ కృష్ణ మూర్తి ఇలాఖాలో నాయకులను తమవైపుకు తిప్పుకోవడానికి వైకాపా ప్లాన్ రెడీ చేసింది. కర్నూలు జిల్లాలోని చాలామంది ఎంపిటిసి, జెడ్పిటిసి నాయకులు వైకాపాలో చేరడానికి సిద్ధం అవుతున్నారు. కొంతమంది ఇప్పటికే కండువా కప్పేసుకున్నారని సమాచారం. ఏదైతేనేం అప్పుడు చంద్రబాబు చేసింది ఇప్పుడు జగన్ చేస్తున్నాడు అంతే తేడా.






