అన్న గమ్యం తమ్ముడితోటేనా? మెగాస్టార్ చిరంజీవి జనసేనలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అందుకు సన్నాహకాలన్నీ పూర్తి చేస్తున్నారా? జనసేన లో వేగంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే సందేహం కలుగుతోంది. జనసేన వచ్చే ఎన్ని కల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని చెబుతున్న పవన్ కళ్యాన్..ప్రధానంగా ఇప్పుడు ఉత్తరాంధ్ర మీదే దృష్టి పెట్టారు. ఉద్దానం సమస్యతో పాటుగా గిరిజనుల సమస్య మీద..విశాఖ నగరం పైనా ఎక్కకువగా ఫోకస్ చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తనకు అండగా నిలిచే ప్రధాన సామాజిక వర్గం ద్వారా ఓట్లు దక్కుతాయనేది ఆయన అంచనాగా కనిపిస్తోంది.
ఇక, ఇదే సమయంలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజారాజ్యం లో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గాలు..అప్పటి నేతలతో జనసేన నేతలు టచ్‌లో ఉన్నారు. వారిని తిరిగి జనసేనలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధా నంగా మెగా కుటుంబానికి పెద్ద సంఖ్యలో ఉన్న అభిమానులను తనకు మద్దతు ఇచ్చేలా పవన్ ప్రయత్నాలు ప్రారంభిం చారు. అందులో భాగంగా..మెగా అభిమానులతో ఆత్మీయ సదస్సు నిర్వహించారు. వారంతా జనసేనలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఇదే సమయంలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలు..ఇస్తున్న నినాదాలు ఇప్పుడు చిరంజీవి చుట్టూ తిరుగుతున్నాయి. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నా..యాక్టివ్ గా లేరు. తమ్ముడితోనే అన్న గమ్యం అంటూ జనసేన ఇస్తున్న స్లోగ న్‌లు కూడా చిరంజీవి జనసేనలోకి ఎంట్రీ ఇస్తున్నారనే సంకేతాలు బలపడుతున్నాయి. ప్రజారాజ్యం ఏర్పాటు ద్వారా అనుకున్నది సాధించలేకపోయి..కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసిన తరువాత చాలామంది రాజకీయంగా చిరంజీవికి దూరమయ్యారు. అయితే, 2014 ఎన్నికల్లో టిడిపి గెలవటం వెనుక మాత్రం పవన్ కళ్యాన్ పాత్ర ఉంది. ఇక, ఇప్పుడు తమ్ముడి పార్టీ కోసం చిరంజీవి ప్రత్యక్షంగా పార్టీలోకి వస్తారా..లేక, పరోక్ష మద్దతు ఇస్తారా అనే చర్చ హాట్ హాట్‌గా సాగుతోంది. ఒక సారి రాజకీయంగా ఎదురుదెబ్బ తిన్న చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చ అవకాశం లేదనే వాదన వినిపిస్తున్నా, తన తమ్ముడి కోసం మద్దతు ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే చిరంజీవి తనయుడు సైతం బాబాయ్ కే తన మద్దతు అని గతంలోనే ప్రకటించారు. ఇక, శ్రీరెడ్డి ఇష్యూ ద్వారా నాగబాబు పూర్తిగా పవన్ కు అండగా నిలుస్తున్నారు. దీంతో..ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కు మద్దతు గా నిలిచే పరిస్థితులు కనిపి స్తున్నాయి. ఇక, చిరంజీవి అధికారిక నిర్ణయం సైతం ఆగస్టులో ఉంటుందని అంచనా.






