జగన్ స్పూర్తిగా పవన్ కళ్యాన్ పోరాడే సమయం ఆసన్నమైంది. ఇప్పటికి పవన్ కళ్యాన్ కు అసలు విషయం భోదపడింది. అది తెలుసుకొనే సరికి తనను ఎంతగా అవమానించారో అర్దమై ఆవేదన వెల్లగక్కుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు తాను విష కౌగిలిలో ఉన్నాననే విషయం ఇప్పుడు తెలుసుకున్నారు. నాడు వైయస్, మీద నేడు జగన్ మీద ఇదే రకంగా టిడిపి పచ్చ మీడియా వ్యవహరించారు. కుట్రలు చేసారు, కుతంత్రాలు నడి పారు. వైయస్ చెప్పినా జగన్ ఇప్పటికీ చెబుతున్నా పవన్ లాంటి వారికి ఆర్దం కాలేదు. టిడిపి అండ్ సపోర్టింగ్ మీడియా ఎంత బరి తెగిస్తుందో పవన్ కు ఇప్పటికి అర్దమైంది. పవన్ను బద్నాం చేయటానికి తెర వెనుక ఎంత స్కెచ్ నడిచిందో అర్దం చేసుకోవటానికి పవన్ కు సమయం పట్టింది.
మెగా ఫ్యామిలీ ఇప్పుడు రోడ్డు మీదకు వచ్చింది. తన పై జరుగుతున్న వికృత దాడిని వరుస ట్వీట్ల ద్వారా పవన్ విరుచుకుపడ్డారు. లోకేష్ చేస్తుందేంటి ఆయన మిత్రులతో కలిసి మద్దతు మీడియా లో జరుగుతుందేంటి అంటూ కోట్లాది మందికి తెలిసేలా ముఖ్యమంత్రిని నిలదీసారు. గతంలో ప్రజారాజ్యం స్థాపన సమయంలో చిరంజీవి కుటుంబ వ్యవహారమైనా శ్రీజ విషయాన్ని మీడియాలోకి తీసుకొచ్చి చిరంజీవి ని డామేజ్ చేసే ప్రయత్నాలు చేసారు. టిడిపి కి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదు. ఎవరూ వాస్తవాలు చెప్పకూడదు. చెబితే ఇంతే, ఇదే పరిస్థితి ఎదురవుతుంది. తొమ్మిదేళ్లుగా వైసిపి అధినేత జగన్ ఈ కుట్రలను అన్నీ ఎదుర్కొంటున్నాడు. జగన్ ఏ రకం గా వీటిపి ఫేస్ చేసాడో ప్రజా బలంతో ఎలా తిప్పి కొడుతున్నాడో ఇప్పటికైనా అర్దమై ఉంటుంది. గత మార్చి 14 వరకు పవన్ కళ్యాన్ కు జగన్ చెప్పే ఏ మాట వినిపించలేదు.
చంద్రబాబు కే అండగా నిలచారు. మీడియా తనకు కవరేజ్ ఇస్తుంటే అది తన గొప్పతనమనుకున్నారు. తన అవసరం ఉన్నంత వరకు మద్దతుగానే ఉంటారని పవన్ గ్రహించలేదు. ఎప్పుడైతే పవన్ గొంతు విప్పారో అప్పుడే టార్గెట్ పవన్ ఫిక్స్ అయిపోయింది. మెగా కుటుంబం మొత్తం మీడియా ముంద దుకు వచ్చి ఆందోళన చేసే వరకూ పవన్ కళ్యాన్ నల్ల దుస్తులతో ఫిలం ఛాంబర్ కు వచ్చే వరకూ పచ్చ మీడియా తమకు టిడిపి అండ ఉందనే ధీమాతో చెలరేగిపోయారు.
మీడియా చేతిలో ఉంటే ఎవరిమీద అయినా నిందలు వేసేద్దాం టిడిపి ని కాపాడుకుందాం అనే అహంకారంతో వ్యవహరిస్తున్నానే ఆరోపణలు ఉన్నాయి. శ్రీ రెడ్డిని పావుగా మార్చుకొని మధ్యలో వైసిపి ని లాగే ప్రయత్నం చేసారు. పవన్ ను డామేజ్ చేసే కుయుక్తులు పన్నారు. పవన్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకున్నారు. కానీ, వీరి పై పోరాటం చేయకపోతే..పూర్తిగా డామేజ్ చేయటం ఖాయం. ఈ పోరాటాన్ని తప్పు బడుతారు. ఆ అవకాశం లేకుండా ఎక్కడా ఉద్రిక్తతలకు తావు లేకుండా వారి అకృత్యాలను ఎండగట్టాల్సిందేనని విశ్లేషకుల అభిప్రాయం. వారి పై పోరాటం లో జగన్ ఏ రకంగా వ్యవహరించారో ఎంత మంది అభిమానులు అండగా నిలిచారో ఇప్పటికైనా అర్దం చేసుకోండి.






