Home Blog Page 20

జ‌గ‌న్ అభిమానులు ఇది తెలుసుకోవాల్సిందే – Secret Behind Jagan Success

0

200 రోజులుగా జ‌గ‌న్ దిన‌చ‌ర్య ఇదే..
జ‌గ‌న్ లోని క‌మిట్ మెంట్‌చూస్తే..దిమ్మ తిర‌గాల్సిందే..!!

తాను న‌మ్మిన వారి కోసం..త‌న‌ను న‌మ్మిన వారి కోసం..!!
జ‌గ‌న్ పాద‌యాత్ర దిన‌చ‌ర్య చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే..

జ‌గ‌న్ అభిమానులు ఇది తెలుసుకోవాల్సిందే..!!
జ‌గ‌న్ పాద‌యాత్ర దిన‌చ‌ర్య చూస్తే ఫ్లాన్ కానివారెవ్వ‌రు..!!

జ‌గ‌న్ పాద‌యాత్ర విజ‌య ర‌హ‌స్యం ఏంటి. ఆయ‌న తీసుకొనే ఫుడ్ ఏంటి. ఆరోగ్య ప‌రంగా తీసుకొనే జాగ్ర‌త్త‌లు ఏంటి. పాద యాత్ర‌లో ఆయ‌న రోజువారీ షెడ్యూల్ ఎలా మెయిన్ టెయిన్ చేస్తున్నారు. జ‌గ‌న్ అభిమాని ప్ర‌తీ ఒక్కరికి ఇది తెలుసుకో వాల‌నే ఉత్సుక‌త ఉంది. వారికే కాదు..టిడిపి శ్రేణుల్లోనూ దీని పైనే చ‌ర్చ‌. టిడిపి అధినేత డైట్..యోగా గురించి మ‌ద్ద‌తుగా నిలిచే ప‌త్రిక‌లు ఎంతో ప్ర‌చారం చేసాయి. కానీ, జ‌గ‌న్ 200 రోజులుగా చేస్తున్న పాద‌యాత్ర దాదాపు 2500 కిలో మీట‌ర్ల‌కు చే రింది. ప‌ది జిల్లాల్లో యాత్ర పూర్త‌వుతోంది. పాద‌యాత్ర పూర్తి చేయ‌టం జ‌గ‌న్ వ‌ల‌న సాధ్యం కాద‌ని టిడిపి అనేక విమ‌ర్శ‌లు చేసింది. కానీ, జ‌గ‌న్ మాత్రం త‌న క‌మిట్‌మెంట్ ఏంటో నిరూపిస్తున్నారు. న‌వంబ‌ర్ ఆరున ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మై న పాద‌యాత్ర‌..చలికాలం..ఎండాకాలం పూర్తి చేసుకొని వ‌ర్షాకాలంలోకి అడుగు పెట్టింది.

ఇక‌, జ‌గ‌న్ ఈ రెండు వంద‌ల రో జుల పాద‌యాత్ర‌లో ప్ర‌తీ రోజు డ‌స్ట్ ఎల‌ర్జీకి గుర‌వుతూనే ఉన్నారు. కాళ్ల‌కు బొబ్బ‌ల‌తో బాధ ప‌డుతున్నారు. నడుం నొప్పి ఉంటే బెల్ట్ తో నొప్పిని అనిచివేస్తున్నారు. త‌న శారీర‌కంగా ఎదుర‌వుతు న్న ఇబ్బందుల‌ను పంటి బిగువ‌న బిగ‌ప‌ట్టి..పైకి చిరున‌వ్వుతో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన వారిని స్వ‌చ్చ‌మైన ప్రేమ తో ఆద‌రిస్తున్నారు. జ‌గ‌న్ ప్రేమతో అవ్వ‌ల‌కు ముద్దులు.. చెళ్లెమ్మ‌ల‌కు..మ‌హిళా యువ‌త‌తో సెల్ఫీల‌తో..ఇలా ఎవ‌రినీ డిసప్పాయింట్ చేయ‌టం లేదు. ఎండాక‌లంలో జ‌గ‌న్ వ‌డ‌దె బ్బ‌కు గుర‌య్యారు. కానీ, పాద‌య‌త్ర ఆప‌లేదు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాద‌యాత్ర స‌మ‌యంలో 103 డిగ్రీల జ్వ‌రం వ‌చ్చిం ది. ఒక్క రోజే రెస్ట్ తీసుకున్నారు. మ‌రుస‌టి రోజు 100 డిగ్రీల జ్వ‌రంతోనే పాద‌యాత్ర ప్రారంభించారు. ఎంత జ్వ‌రం వ‌చ్చి నా కేవ‌లం పారాసిటామ‌ల్ టాబ్లెట్ తో యాత్ర సాగిస్తున్నారు. శ‌రీరం ఎంత అలిసినా..ఎన్ని బాధ‌లు అనిపించినా..యాంటీ బ‌యోటిక్స్ జ‌గ‌న్ వాడ‌టం లేదు.

జ‌గ‌న్ ను రెగ్యుల‌ర్ గా ఓ ప‌ర్స‌న‌ల్ డాక్ట‌ర్ ఫాలో అవుతారు. పాద‌యాత్ర కు విరామం ఇవ్వాల్సి ఉంద‌ని సూచించినా ..జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. ప్ర‌తీ రోజు న‌డ‌క కార‌ణంగా శ‌రీరం డీహైడ్రేడ్ కాకుండా గ్లూకోజు వాట‌ర్ తీసుకుంటారు. ప్ర‌తీ రోజు దాదాపు 12 కిలో మీట‌ర్లు న‌డ‌క‌..వేలాది మందితో క‌లిసే జ‌గ‌న్..నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌లు..పార్టీ నేత‌ల‌తో మంత‌నా లు..జిల్లాలో పార్టీ ప‌రిస్థితుల పై సూచ‌న‌లు చేస్తూ..పాద‌యాత్ర సాగిస్తున్నారు. ప్ర‌తీ రోజు ఇవ‌న్నీ పూర్తి చేయ‌టానికి అర్ద రాత్రి వ‌ర‌కు ప‌డుతుంది. కానీ, తిరిగి తెల్ల వారి 4.30 గంట‌ల‌కే నిద్ర లేస్తారు. యోగా..ఏరోబిక్స్‌..ఎక్స‌ర్‌సైజ్ లు చేస్తారు. ఇక‌, ఆహారంలో పూర్తి నియంత్ర‌ణ పాటిస్తున్నారు. నాన్ వెజ్ మానేసారు. ఉద‌యం గ్లాసు జ్యూస్ మాత్ర‌మే తీసుకుంటున్నారు. మ‌ధ్యాహ్నం కొద్దిగా అన్నం..పుల్కాలు..ప‌ప్పు..కూర‌, మ‌జ్జిగ తీసుకుంటారు. రాత్రికి కొద్దిగా అన్నం, రెండు పుల్కా లు, కూర తో లైట్ గానే ముగించేస్తున్నారు. తాను నమ్మిన వారి కోసం..త‌న‌ను న‌మ్ముకున్న వారి కోసం జ‌గ‌న్ ఎప్పుడూ వెనుకాడ‌డు అని చెప్ప‌టానికి 200 రోజులుగా సాగుతున్న ఈ పాద‌యాత్ర లో జ‌గ‌న్ ప్ర‌తీరోజు అనుస‌రించే విధాన‌మే నిద‌ర్శ‌నం. మ‌రి..ఇటువంటి అంకిత‌భావం ఉన్న నేతకు అంత‌గా జ‌నాద‌ర‌ణ ఉండ‌టంలో ప్ర‌త్యేక‌త ఏమీ లేదు. మ‌రి..జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఆయ‌న దిన‌చ‌ర్య చూసే వారు జ‌గ‌న్ ను అభిమానించ‌క ఉండ‌గ‌ల‌రా.?

జ‌గ‌న్ వెనుక టిడిపి కోవ‌ర్టులు – Yellow Coverts in Prajsankalpayatra

0

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో సంచ‌ల‌న విష‌యం. జ‌గ‌న్ వెనుక టిడిపి కోవ‌ర్టులు. పాద‌యాత్ర‌లో ప్ర‌తీ అడుగులోనూ ఫాలో అవుతున్న టిడిపి శ్రేణులు. జ‌గ‌న్ పాద‌యాత్ర పై తొలి నుండి ఏపి ప్ర‌భుత్వం నిఘా పెట్టిన సంగ‌తి తెలిసిందే. టిడిపి అనుకూల ప్రాంతాల్లో ప్ర‌త్యేకంగా డ్రోన్లు ఏర్పాటు చేసి మ‌రీ నిఘా పెట్టారు. జ‌గ‌న్ ఎవ‌రితో మాట్లాడుతున్నారు..ఎవ‌రెవరు వ‌చ్చి జ‌గన్ ను క‌లుస్తున్నారు..జ‌గ‌న్ ఎటువంటి హామీలిస్తున్నార‌నే దాని పై ఇప్ప‌టి వ‌ర‌కు దృష్టి సారించారు. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో వైసిపి శ్రేణులే కాదు..టిడిపి నియ‌మించిన వాలంటీర్లు ఫాలో అవుతున్నారు. దీనిని ప‌సి గ‌ట్టిన వైసిపి నేత‌లు వారిని విచారించ‌గా అస‌లు విష‌యం బ‌ట‌య‌కు వ‌చ్చింది.

ఉండ‌వ‌ల్లి స‌మీపంలో జ‌గ‌న్ స‌భలో కొంద‌రు ట‌మోటాలు..కోడిగుడ్ల‌తో జ‌గ‌న్ స‌భ‌కు హాజ‌రు కావ‌టం..వారిని వైసిపి శ్రేణులు గుర్తించి పంపించి వేయ‌టం జ‌రిగింది. ఇక‌, ఇప్పుడు  ప్ర‌త్యేకంగా పాద‌యాత్ర‌లో అడుగ‌డుగునా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను సేక‌రించి..టిడిపి కార్యాల‌యానికి స‌మాచారం చేర‌వేయ‌టం వారి ప్ర‌ధాన విధి. వైసిపి కార్య‌క‌ర్త‌ల్లో క‌లిసి పోయి వారి..వైసిపి కార్య‌క‌ర్త‌ల్లాగానే వ్య‌వ‌హ‌రిస్తూ..కోవ‌ర్టు ఆప‌రేష‌న్లు చేస్తున్నారు. వీటిని వైసిపి శ్రేణులు ప‌సి గట్టాయి. పాద‌యాత్ర ప్రారంభం అయిన రోజు దాదాపు 50 మంది టిడిపి నియ‌మిత వాలంటీర్లు ఈ బాధ్యతలు నిర్వ‌హిస్తున్నారు. ఈ విష‌యాన్ని వైసిపి శ్రేణులు పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లాయి. కొంద‌రిని నేరుగా ప‌ట్టుకొని విచారించారు. ఇప్పుడు, పాద‌యాత్ర‌లో ఈ అంశ‌మే ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  టిడిపి నేరుగా ఎదుర్కొన లేక‌..ఇటువంటి చీప్ ట్రిక్స్ కు దిగ‌ట‌మే స‌హ‌జ‌మైన విష‌యంగానే     భావించాల్సి ఉంటుంద‌నే భావ‌న కూడా కొంత మంది నేత‌ల నుండి వ్య‌క్తం అవుతుంది.

ఇటువంటి రాజ‌కీయాల‌ను వైసిపి చేయ‌దని జగ‌న్ వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం. అయితే , ఇప్ప‌టికే జ‌గ‌న్ ఎఫెక్ట్ ఏపిలో ఏమేర ఉందో తెలుసుకోవ‌టానికి కేంద్ర నిఘా సంస్థ ప్ర‌తినిధులు జ‌గ‌న్ ను ఫాలో అవుతున్నారు. ఏపిలో అధికారంలోకి రావ‌టానికి కీల‌కం కావ‌టంతో పాటుగా..ప్ర‌స్తుతం సున్నిత‌మైన అంశాల‌తో రాజ‌కీయంగా కీల‌కంగా మారిన ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌భావం నేరుగా అధ్య‌య‌నం చేయ‌టానికి కేంద్ర నిఘా సంస్థ‌ల ప్రతినిధులు పాద‌యాత్ర‌ను ఫాలో అవుతున్న‌ట్లు స‌మాచారం. ఇదే స‌మయంలో జ‌గ‌న్ ప్ర‌తీ అడుగునూ రాష్ట్ర నిఘా అధికారులు లోతుగా తెలుసుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర తో పాటుగా ప్ర‌తీ స‌భ‌లోనూ రాష్ట్ర నిఘా సిబ్బంది త‌మప‌ని తాము చేసుకుపోతున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర తో గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్న టిడిపి నాయ‌క‌త్వం…ప్ర‌భుత్వ నిఘా వ్య‌వ‌స్థ ద్వారానే కాకుండా.. వైసిపి శ్రేణుల్లో..టిడిపి నియ‌మించిన ప్ర‌త్యేక వాలంటీర్ల‌ను చొప్పించి వారి ద్వారా స‌మాచారం సేక‌రించే ప‌ని కొన‌సాగుతోంది. దీని ద్వారా..టిడిపి పైకి ఎన్నిచెప్పినా..జ‌గ‌న్ పాద‌యాత్ర అంటే ఎంత‌గా టెన్ష‌న్ ప‌డుతుందో అర్దం అవుతోంది. ఈ ర‌క‌మైన ప‌రిస్థితి ఎప్పుడూ చూడ‌లేద‌ని వైసిపి శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. జ‌గ‌న్ అభిమాన సంఘాల్లోనూ..జ‌గ‌న్ అనుకూల వ‌ర్గాల్లోనూ టిడిపి అనుకూల వ్య‌క్తులు ఇదే ర‌కంగా జ‌గ‌న్ అభిమానుల పేరు తో చొర‌బ‌డి..అక్క‌డి విష‌యాలు తెలుసుకోవ‌టంతో పాటుగా..డామేజింగ్ కంట్రోల్ కోసం టిడిపి నాయ‌కత్వం నుండి వ‌చ్చిన సూచ‌న‌ల మేర‌కు న‌డుచుకుంటున్నారు.

నారా వ‌ర్సెస్ నాని..గెలుపెవ‌ర‌ది? – Kodali Nani Vs Nara Lokesh in Gudiwada

0

నారా వ‌ర్సెస్ నాని..గెలుపెవ‌ర‌ది..!!
అస‌లు..సిస‌లు మ‌జా ఈ పోరుతోనే..!!

గుడివాడ లో బ‌స్తీమే స‌వాల్‌…!!
ఎవ‌రి స‌త్తా ఏంటో తెలియాలంటే…ఇది చూడాల్సిందే..!!

బ‌స్తీమే స‌వాల్‌. నాని వ‌ర్సెస్ నారా. అస‌లైన రాజ‌కీయ రంజుకు వేదిక‌. గుడివాడ కేంద్రంగా పొలిటిక‌ల్ వార్‌. ఎపిలో ఇప్ప‌టి కే ఎన్నిక‌ల వాతావార‌ణం క‌నిపిస్తోంది. లోక్‌స‌భ‌కు ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చినా..ఏపి అసెంబ్లీ ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా..ఈ సారి టిడిపి వ‌ర్సెస్ వైసిపి పోరు హోరా హోరీ గా సాగ‌టం ఖాయం. ఇక‌, కొద్ది రోజులుగా మంత్రి లోకేష్ చేస్తున్న రాజ‌కీయ కామెంట్లు కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు తెర లేపుతున్నాయి. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టం ఖాయ‌మ‌ని లోకేష్ తేల్చి చెప్పారు. అయితే, ఎక్క‌డి నుండి పోటీ చేయాలో పార్టీ నిర్ణ‌యిస్తుంద‌ని స్ప‌ష్టం చేసారు. కానీ, టిడిపిలో..పార్టీ ప్ర‌ముఖుల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌ను ప‌రిశీలిస్తే లోకేష్ కోసం పార్టీ అధినేత కుప్పం నియోజ‌క‌వర్గం సుర‌క్షితంగా భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కుప్పం నుండి లోకేష్ ను దింపే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. అదే స‌మయంలో మామ బాల‌కృష్ణ ఖ‌చ్చితంగా హిందూపూర్ నుండే పోటీ చేస్తార‌ని లోకేష్ చెబుతున్నారు.

అయితే, కుప్పం నుండి లోకేష్ ను దింపితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఖ‌చ్చితంగా కృష్ణా లేదా గుంటూరు జిల్లాల్లోని ఒక నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచు కోవాల్సి ఉంటుంది. ఇదే స‌మ‌యంలో మ‌రో వాదన వినిపిస్తోంది. లోకేష్ కు కుప్పం అప్ప‌గిస్తే..వేరే నియోజ‌క‌వ‌ర్గం నుండి గెలిచే అవ‌కాశం లేక కుప్పం నుండి పోటీ చేయించార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తే అవ‌కాశం ఉంది. దీంతో..లోకేష్ ను  రాజ‌ధాని ప్రాంతం నుండి ఒక నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేయించే అవ‌కాశామూ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. దీంతో..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు లేదా మంత్రి లోకేష్ ఒక‌రు కుప్పం నుండి పోటీ చేస్తే..మ‌రొక‌రు వేరే నియెజ‌క వ‌ర్గం నుండి పోటీ చేయాలి. ఇందు కోసం కృష్ణా జిల్లా గుడివాడ పై ఇప్పుడు టిడిపిలో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. తొలి నుండి గుడివాడ టిడిపికి అనుకూలంగా ఉంద‌ని..అక్క‌డి నుండి ఎన్టీఆర్ సైతం 1983, 1985 ఎన్నిక‌ల్లో గెలిచార‌ని పార్టీ నేత‌లు గుర్తు చేస్తున్నారు.

అయితే, ప్ర‌స్తుతం వైసిపి ఫైర్‌బ్రాండ్ కొడాలి నాని 2004,2009 లో టిడిపి నుండి…2014 లో వైసిపి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు అక్క‌డ ఎలాగైనా కొడాలి నాని గెల‌వ‌కుండా చూడాల‌ని టిడిపి హైక‌మాండ్ నుండి లోక‌ల్ టిడిపి నేత‌ల‌కు సూచ‌న‌లు వెళ్తున్నాయి. టిడిపి టార్గెట్ చేసిన వైసిపి ముఖ్య‌నేత‌ల్లో కొడాలి నాని ఒక‌రు. దీంతో..కొడాలి నాని ని గుడివాడ‌లో ఈ సారి ఢీ కొట్టటానికి నారా వారి కుటుంబం నుండి పోటీకి నిల‌వాల‌నే ఆలోచ‌న చాలా సీరియ‌స్ గా జ‌రుగుతోంది. ఫ‌లితం ఎలా ఉంటుంద‌నే దాని పైనే త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ముఖ్య‌మంత్రి లేదా మంత్రి హోదా నుండి వ‌చ్చిన వ్య‌క్తి గుడివాడ‌లో బ‌రిలోకి దిగి కొడాల‌ని నానిని ఎదుర్కోవాల‌నేది ఆలోచ‌న‌గా తెలుస్తోంది. మ‌రి ఇదే విధంగా గుడివాడ‌లో ..నారా వ‌ర్సెస్ నాని అన్న‌ట్లుగా వార్ జ‌రిగితే..ఫ‌లితం ఏమ‌వుతుంది. గెలిచేదెవ‌రు. కొడాలి నాని ..నారా అభ్య‌ర్ధిని ఎలా ఎదుర్కొంటారు. ఇప్పుడు…ఇదే హాట్ టాపిక్‌. మ‌రి..ఈ ర‌స‌వ‌ర‌త్త పోరు జ‌రిగితే ..ఏం జ‌రుగుతుందో..మీ అంచ‌నాలేంటో..మీ కామెంట్ల రూపంలో తెలిచ చేయండి.

ప్ర‌జానాడిని ప‌సి గ‌ట్టిన జ‌న‌నేత‌ – YS Jagan Find People Intention

0

ప్ర‌జానాడిని ప‌సి గ‌ట్టిన జ‌న‌నేత‌..
వ‌చ్చే ఎన్నిక‌ల‌ పై జ‌గ‌న్ అంచ‌నా ఇదే..!!

జ‌గ‌న్ మ‌దిలోని మాట వింటే..ఉప్పొంగాల్సిందే..
జ‌గ‌న్ నోట ఊహించ‌ని మాట‌..కేడ‌ర్‌లో న‌యా జోష్‌..!!

జ‌గ‌న్ నోట ఊహించ‌ని మాట‌. ఎటువంటి ప‌రిస్థితులు ఎదురైనా కూల్ గా ఉంటూ చెర‌గ‌ని చిరున‌వ్వుతో క‌నిపించే జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైసిపి లో కొత్త జోష్ ను నింపుతున్నాయి. జ‌గ‌న్ పాద‌యాత్ర 200 రోజులు పూర్త‌యింది. తొమ్మిది జిల్లాల్లో పూర్త‌యి పాద‌యాత్ర ప్ర‌స్తుతం తూ ర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. ఈ రెండు వంద‌ల రోజుల పాద‌యాత్ర లో అనేక వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో జ‌గ‌న్ మ‌మేకం అయ్యారు.

తొలుత రాయ‌ల‌సీమ‌కే జ‌గ‌న్ ఛ‌రిష్మా ప‌రిమిత‌మ‌ని టిడిపి నేత‌లు అంచనా వేసారు. జ‌గ‌న్ పాద‌యాత్ర కొద్ది రోజుల‌కే ప‌రిమిత‌మ‌నే వ్యాఖ్య‌లు చేసారు. కానీ, జ‌గ‌న్ టిడిపి నేత‌ల ఆశ‌ల‌ను అడియాస‌లు చేసారు. ప‌ట్టుద‌ల‌..కార్య‌దీక్ష ఉన్న జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను అప్ర‌తిహాతంగా కొన‌సాగిస్తున్నారు. రాయ‌ల‌సీమ మొద‌లు అనేక ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న సామాజిక వ‌ర్గాల‌తో ఆత్మీయ స‌ద‌స్సులు నిర్వ‌హిస్తూ వారికి మ‌రింత‌గా ద‌గ్గ‌ర‌య్యారు. రాయ‌ల‌సీమ ను మించిన జ‌నాద‌ర‌ణ కోస్తా జిల్లాలో ల‌భించింది. కృష్ణా వార‌ధి..గోదావ‌రి బ్రిడ్జి జ‌గ‌న్ తో క‌లిసి అడుగు వేసిన జ‌న హోరు తో ఊగి పోయాయి. జ‌గ‌న్ సృష్టించిన జ‌న సునామీ తో ఉభ‌య గోదావ‌రి జిల్లాలు ఊగి పోయాయి. టిడిపి కి మ‌ద్ద‌తుగా నిలిచే వ‌ర్గాలు ఉండే ప్రాంతాలు జ‌గ‌న్ కు జై కొట్టాయి. అనేక మంది పార్టీలో చేరారు. ఆరోగ్య ప‌రంగా ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్నా..పైకి చిరున‌వ్వుతో ముందుకు సాగుతూనే ఉన్నారు. ప్ర‌తీ జిల్లాలో పార్టీ ప‌రిస్థితుల పై ఆరా తీస్తున్నారు. జ‌గ‌న్ స‌భ‌కు జ‌నం పోటెత్తుతున్నారు. ప్ర‌తీ స‌భలో జ‌గ‌న్ ను చూడ‌గానే సీయం సీయం అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి. పాద‌యాత్ర తూర్పు గోదావ‌రి వ‌చ్చే వ‌ర‌కు జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫ‌లితాల అంచ‌నా పై ఎక్క‌డా ఎవ‌రితోనూ త‌న అభిప్రాయం షేర్ చేసుకోలేదు. కానీ, తూర్పు గోదావ‌రి లో వ‌చ్చిన స్పంద‌న త‌రువాత జ‌గ‌న్ లో కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ పెరిగాయి. ఇత‌ర జిల్లాల్లోనూ ప్ర‌జా నాడి ప‌సిగ‌ట్టినా.. ఏ ఒక్క‌రితోనూ జ‌గ‌న్ త‌న అంచ‌నాలు ఏంటో ఎక్క‌డా చెప్ప‌లేదు. తాజాగా, తూర్పు గోదావ‌రి లో త‌న‌కు క‌ల‌వ‌టానికి వ‌చ్చిన ఉత్తాంధ్ర నేత‌ల‌తో జ‌గ‌న్ మ‌న‌సు విప్పారు. తాను పాద‌యాత్ర‌లో భాగంగా ప్ర‌జ‌ల నాడి ఏంటో గుర్తించాన‌ని..రేప‌టి కోసం ఎన్నో ఆశ‌ల‌తో ప్ర‌జ‌లు ఉన్న విష‌యాన్ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు. అదే స‌మ‌యంలో..ఒక కీల‌క కామెంట్ చేసారు. ఇక‌, వైసిపి విజ‌యాన్ని ఆప‌టం ఎవ‌రి త‌రం కాదు. ఇక‌..ఎన్నిక‌లకు సిద్దం కండి. క‌ద‌న రంగంలోకి దూక‌టానికి సిద్దం కండి.

విజ‌యం మ‌న‌దే అంటూ ఆ నేత‌ల‌కు స్ప‌ష్టం చేసారు. ఇది..తాను ఉత్సాహం కోసం చెబుతున్న‌ది కాద‌ని….ప్ర‌జ‌లు కోరుకుంటున్న‌దే చెబుతున్నాన‌ని తేల్చి చెప్పారు. ఎప్పుడూ ఇంత‌లా విజ‌యంపై స్పందించ‌ని జ‌గ‌న్‌..పార్టీ నేత‌ల‌తో చెప్పిన మాట‌లు ఇప్ప‌డు వైసిపి లో హాట్ టాపిక్ గా మారాయి. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌తో కేడ‌ర్ లోఇప్పుడు కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. పాద‌యాత్ర 200 వ రోజున ఇదే వైసిపి లో జోష్ ను నింపింది. జ‌గ‌న్ మాట‌ల‌ను..అంచ‌నాల‌ను నిజం చేస్తామ‌ని పార్టీ నేత‌లు సైతం చెబుతున్నారు.

టార్గెట్ జ‌గ‌న్ అంట‌..అయ్యే ప‌నేనా? – Kiran Kumar Reddy Reentry into Congress

0

సొంత నియోజ‌క‌వ‌ర్గంలో గెల‌వ‌లేరు…
జ‌గ‌న్ విజ‌యాన్ని అడ్డుకుంటార‌ట‌..!!

ముసుగు తొలిగింది….రీ ఎంట్రీ
టార్గెట్ జ‌గ‌న్ అంట‌..అయ్యే ప‌నేనా..!!

ఆఖ‌రి బంతికి సిక్స్ కొడ‌తా..ఈ డైలాగ్ విన‌గానే ఆ వ్య‌క్తి గుర్తుకు వ‌చ్చేస్తాడు. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో సొంత త‌మ్ముడిని గెలిపించుకోలేని ఆ మాజీ ముఖ్య‌మంత్రి..ఇప్పుడు వైసిపి ని ల‌క్ష్యంగా చేసుకొని మ‌రోసారి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వ‌స్తున్నార‌ట‌. మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి..తిరిగి కాంగ్రెస్ లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించేందుకు సిద్ద‌మైపోయారు. ఏపి ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర విభ‌జ‌న‌ను ఆపుతాన‌ని చెప్పి..చెప్పుల పార్టీ పెట్టి..ప‌రోక్షంగా టిడిపికి స‌హ‌క‌రించిన వ్య‌క్తి. సీయంగా ఉన్న స‌మ‌యంలో టిడిపి స‌హ‌కారంతో ముఖ్య‌మంత్రిగా కొన‌సాగారు.

వైసిపి..టిఆర్‌య‌స్ అవిశ్వాసం పెడితే చంద్ర‌బాబు స‌హ‌కారంతో గ‌ట్టెక్కారు. తెలుగు – కాంగ్రెస్ ప్ర‌భుత్వ ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర విభ‌జ‌న ప్ర‌క్రియ ను అసెంబ్లీలో పూర్తి చేసిన నేత‌గా చ‌రిత్ర‌లో నిలిచిపోయారు. ఇక‌, రోశ‌య్య ను ముఖ్య‌మంత్రి గా దించి..త‌న‌కు సీయంగా అవ‌కాశం ఇస్తే..కాంగ్రెస్ ను ధిక్క‌రించిన జ‌గ‌న్ ను తాను కంట్రోల్ చేస్తాన‌ని సోనియా కు హామీ ఇచ్చారు. కిర‌ణ్ సీయం కాగానే..జ‌రుగుతున్న కుట్ర‌ల ను గుర్తించి జ‌గ‌న్ కాంగ్రెస్ ను వీడారు. జ‌గ‌న్ పై కేసులు పెట్టి లోప‌ల వేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చింది కూడా ఈ కిర‌ణ్ కుమార్ రెడ్డే.

ఇక‌, జ‌గ‌న్ అరెస్ట్ స‌మ‌యంలో వైయ‌స్ కుటుంబ స‌భ్యుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిందీ కిరణ్ స‌ర్కార్‌లోని పోలీసులే. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి..ఇప్ప‌టి వ‌ర‌కు క్రియా శీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఇక‌, కిర‌ణ్ సోద‌రుడు కిషోర్ టిడిపిలో చేరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి పీలేరు అభ్య‌ర్ధిగా పోటీ చేయ‌నున్నారు. తండ్రి రాజ‌కీయంగా విబేధించి పోరాడి న చంద్ర‌బాబు వ‌ద్ద‌కే త‌మ్ముడు కిషోర్ చేరాడు. కిర‌ణ్ ను సైతం చంద్ర‌బాబు టిడిపిలోకి ఆహ్వానించారు. ఇక‌, కిర‌ణ్ రేపో మాపో కాంగ్రెస్ లో తిరిగి చేర‌టం లాంఛ‌న‌మే. ఏపిలో టిడిపిని కాదు..వైసిపి ని టార్గెట్ చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చింది కిర‌ణ్ కుమార్ రెడ్డేన‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికీ జ‌గ‌న్ మీద ఉన్న అక్క‌సు తోనే కాంగ్రెస్ -టిడిపి ని క‌లిపి..వ‌చ్చే ఎన్నిక ల్లో కొత్త వ్యూహాలు అమ‌లు చేయ‌ట‌మే కిర‌ణ్ అస‌లు ల‌క్ష్యంగా తెలుస్తోంది. అయితే, ముఖ్య‌మంత్రిగా ఉండ‌గానే..జ‌గ‌న్ జైళ్లో ఉన్నా..జ‌గ‌న్ ప్ర‌భంజ‌నాన్ని కిర‌ణ్ అడ్డుకోలేక పోయారు. ఇక‌, ఇప్పుడు కాంగ్రెస్ నేత‌గా జ‌గ‌న్ ను నిలువ‌రించ‌టానికే కిర‌ణ్ రీ ఎంట్రీ ఇస్తున్నార‌ని టిడిపి మ‌ద్ద‌తు ప‌త్రిక‌లు రాస్తున్నాయి.

ఇప్పుడు కిర‌ణ్ కు అంత సీన్ ఉందా. అస‌లు పీలేరు లో సొంత త‌మ్ముడిని గెలిపించుకోగ‌ల‌రా. ఏపిలోనే కాదు..సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ప్ర‌భావితం చేయ‌లేని వ్య‌క్తి కాంగ్రెస్ జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తార‌నంటే నమ్మ‌ద‌గిన విషయ‌మేనా. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ముసుగు తొలిగించుకొ ని..టిడిపి ప‌రోక్షంగా స‌హ‌క‌రించ‌టం..జ‌గ‌న్ వ్యతిరేకుల‌కు సాయం అందించ‌ట‌మే ల‌క్ష్యంగా పాలిటిక్స్ లో రీ ఎంట్రీ ఇస్తున్న కిర‌ణ్ ల‌క్ష్యం నెర‌వేర‌టం సాధ్య‌ప‌డుతుందా.. సాధ్యం కాద‌ని ప్ర‌స్తుత రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలే తేల్చి చెబుతున్నాయి.

రాప్తాడు లోనూ అదే ప‌రిస్థితి..!! టిడిపి కంచుకోట‌ల‌పై వైసిపి జెండా ఖాయం. – YSRCP Raptadu MLA Candidate Face to Face Paritala Family

0

రాప్తాడు లోనూ అదే ప‌రిస్థితి..!!
టిడిపి కంచుకోట‌ల‌పై వైసిపి జెండా ఖాయం..!!

అనంతో వైసిపి పాగా ఖాయం. టిడిపి కంచుకోట‌లో టిడిపి సీన్ రివ‌ర్స్. 2014 అనుకూలించిన ప‌రిస్థితులు ఇప్పుడు పూర్తి ప్ర‌తికూలంగా మారాయి. ఈ జిల్లాలో అధికార పార్టీలో ఆధిప‌త్య పోరు నెల‌కొంటే..వైసిపి చాప కింద నీరు బ‌లోపేతం అవుతోంది. ఇక్క‌డ అధికార పార్టీలో ఎంపీలంటే ఎమ్మెల్యేలకు సరిపడటం లేదు.. ఎమ్మెల్యేలంటే ఎంపీలకు పడటం లేదు. జెసి బ్ర‌ద‌ర్స్‌…ప్ర‌భాక‌ర చౌద‌రి మ‌ధ్య గ్యాప్ పూడ్చ‌లేని స్థాయికి చేరిపోయింది. కేవ‌లం తాడిప‌త్రి, అనంత‌పురం అర్బ‌న్ మాత్ర‌మే కాకుండా గుంత‌క‌ల్లులో నూత‌న మాటే చెల్లుబాటు అయ్యేలా జెసి ప్ర‌య‌త్నిస్తున్నారు.

అక్క‌డ జితేంద్ర గౌడ్ ను కాద‌ని మ‌ధు సూధ‌న్ గుప్తాను తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రాయదుర్గంలో మంత్రి కాలవ వర్గానికి ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వర్గానికి అస్సలు పడటం లేదు.. మెట్టు గోవిందరెడ్డి వర్గం కూడా త‌న అధిప‌త్యం కోసం పోరాటం చేస్తోంది. కల్యాణదుర్గం నియోజకవర్గంలోనూ  మంత్రికి.. ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి పడటం లేదు. వ‌చ్చే ఎన్నికల్లో చాలా చోట్ల కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఎంపీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో కలకలం రేపాయి. క‌దిరిలో ఎమ్మెల్యే చాంద్ బాషా. మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ మధ్య గ్యాప్‌ చాలా పెరిగింది. తన కుమారుడికి పుట్టపర్తి టికెట్‌ ఇప్పించాలని ఎంపీ నిమ్మల కిష్టప్ప తెగ ప్రయత్నిస్తున్నారు.. పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథికి నిమ్మల కిష్టప్పకు క్షణం పడటం లేదు. రాప్తాడు ఎమ్మెల్యే .. మంత్రి సునీతకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఉంది. కొందరు నేతలు పనిగట్టుకుని తమపై బురద జల్లుతున్నారని మంత్రి కుమారుడు పరిటాల శ్రీరామ్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తమను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణకు కూడా సొంత పార్టీ నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే స‌మ‌యంలో అనంత‌పురంలో జ‌గ‌న్ పాద‌యాత్ర సంద‌ర్భంగా టిక్కెట్ల కేటాయింపు పై దాదాపు ఓ క్లారిటీకి వ‌చ్చేసారు. అక్క‌డ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపే ల‌క్ష్యంగా వైసిపి నేత‌లు ముందుకు క‌దులుతున్నారు. టిడిపి లో నెల‌కొన్ని ప‌రిస్థితుల‌ను చ‌క్క దిద్దేందుకు టిడిపి అధినేత వ‌రుస స‌మావేశాలు ఏర్పాటు చేసినా ఫ‌లితం ఇవ్వ‌టం లేదు.దీనిని అనుకూలంగా మ‌ల‌చుకొని టిడిపి కంచుకోట పై వైసిపి జెండా ఎగ‌ర‌వేయ‌ట‌మే ల‌క్ష్యంగా వైసిపి అడుగులు వేస్తోంది.

వైసిపి కి ఊహించ‌ని వ‌ర‌మిచ్చిన టిడిపి.. – Chandrababu Comments turned in favour of YSR

0

జ‌గ‌న్ వాద‌న‌కే సీయం మ‌ద్ద‌తు ఇస్తున్నారా..!!
నాడు జ‌గ‌న్‌..నేడు వైయ‌స్ పై వాస్త‌వాలు చెప్పేస్తున్నారు…!!

వైయ‌స్ ను చంద్ర‌బాబు ప‌రోక్షంగా కీర్తిస్తున్నారు. చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు వైసిపి ఇమేజ్ ను పెంచేవే. ఏది ఎక్క‌డ చంద్రబాబు వైయ‌స్ గురించి మాట్లాడారు అని మీ అనుమానమా. అవ‌స‌ర‌మే లేదు. ఎందుకంటే గ‌తంలో జ‌గ‌న్ కేసుల విష‌యంలోనూ చంద్ర‌బాబు నిజాలు ఒప్పుకోక త‌ప్ప‌లేదు. జ‌గ‌న్ పై అవినీతి కేసులంటూ 2014 ఎన్నిక‌ల ముందు నుండి చంద్ర‌బాబు అండ్ టీం తో పాటుగా మ‌ద్ద‌తు మీడియా ఊద‌ర గొట్టింది. కానీ, కొంత కాలం క్రితం న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి టిడిపి లో చేరే స‌మ‌యంలో జ‌గ‌న్ కేసుల గురించి స్ప‌ష్ట‌త ఇచ్చేసారు. సోనియ ను ఎదిరించినందుకే జ‌గ‌న్ పై కేసులు న‌మోద‌య్యాయ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

ఇక‌, ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోల‌వ‌రం -రాజ‌ధాని త‌ర ఘ‌న‌త‌గా చెప్పుకొని మ‌రో సారి తాను అధికారంలోకి వ‌స్తేనే అభివృద్ది కొన‌సాగుతుంద‌ని అప్పుడే చంద్ర‌బాబు అండ్ టీం ప్ర‌చారం మొద‌లు పెట్టింది. అయితే, పోల‌వ‌రం పై బిజెపి క్రెడిట్ గేమ్ మొద‌లు పెట్టింది. అదే స‌మ‌యంలో పోల‌వ‌రం-ప‌ట్టిసీమ లో జ‌రిగిన అవినీతి బ‌య‌ట పెట్ట‌క‌పోతే జైలుకైనా వెళ్తాన‌ని ఏపి బిజెపి అధ్య‌క్షుడు కుండ బ‌ద్ద‌లు కొట్టారు. దీంతో..బిజెపికి క్రెడిట్ రాకుండా ఉండేందుకు ముఖ్య‌మంత్రి కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ఘ‌న‌త కాంగ్రెస్ దేన‌ని చెప్పుకొచ్చా రు. పోల‌వ‌రాన్ని జాతీయ ప్రాజెక్టు చేసిందీ కాంగ్రెస్సే..విభ‌జ‌న చ‌ట్టంలో పెట్టందీ కాంగ్రెస్సే అంటూ ముఖ్య‌మంత్రి వ్యా ఖ్య‌లు చేసారు. అయితే, అస‌లు వైయ‌స్ హ‌యాంలోనే పోల‌వ‌రం కు ఒక రూపు వ‌చ్చింద‌ని.. ఆయ‌న హాయంలోనే పోల‌వరంతో పాటుగా ప్రాణ‌హిత‌-చేవెళ్ల కు జాతీయ హోదా కోసం వైయ‌స్ హాయంలోనే సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యం జ‌రిగింది. దీనిపై అప్ప‌ట్లోనే ముఖ్య‌మంత్రి గా కేంద్రం పై ఒత్తిడి తెచ్చారు.

ఇక‌, ఇప్పుడు వైయ‌స్ త్ర‌వ్వించిన కాల్వ‌నుండే నీరు మ‌ళ్లించి న‌దుల అనుసంధానం అంటూ మ‌ద్ద‌తు మీడియా స‌హ‌కారంతో ప్ర‌చారం చేసుకుంటున్నారు. తాజాగా, ముఖ్య మంత్రి బిజెపికి క్రెడిట్ ఇవ్వ‌కూడ‌ద‌నే ల‌క్ష్యంతో కాంగ్రెస్ కు మ‌ద్ద‌తుగా చేసిన వ్యాఖ్య‌లు…ఖ‌చ్చితంగా ప‌రోక్షంగా వైయ‌స్ ఇమేజ్ ను పెంచేవే. దీనిని వైసిపి శ్రేణులు స‌రిగ్గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌గ‌లిగితే..పోల‌వ‌రం క్రెడిట్ వైయ‌స్ ఖాతాలోకి వెళ్ల‌టం ఖాయం. తొలి నుండి జ‌గ‌న్ పోల‌వ‌రం పై చేస్తున్న వాద‌న‌కు బ‌లంగా ఇప్పుడు స్వ‌యంగా ముఖ్య‌మంత్రి ప‌రోక్షంగా జ‌గ‌న్ వాద‌న‌నే స‌మ‌ర్ధించేలా మాట్లాడార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ఇది..వైసికి ఎంత వ‌ర‌కు అన‌కూలంగా మ‌ల‌చు కుంటుందో చూడాలి.

ఏపికి కాబోయే సీయం జ‌గ‌న్‌.. తేల్చి చెప్పిన గుగూల్‌ – Jagan tops in Google Search as next CM

0

ఏపికి కాబోయే సీయం జ‌గ‌న్‌..
తేల్చి చెప్పిన గుగూల్‌..

ఏపికి కాబోయే సీయం జ‌గ‌న్‌. ఇది వైసిపి మాట కాదు. గుగూల్ తేల్చి చెబుతున్న విష‌యం. గుగూల్ లో 2019 లో ఆంధ్రప్ర‌దేశ్ కు కాబోయే సీయం అంటూ టైపు చేయ‌గానే జ‌గ‌న్ పేరు ద‌ర్శ‌న మిస్తోంది. అంతే కాదు..కోరా అంత‌ర్జాతీయ సంస్థ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కాబోయే ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌నే ప్ర‌శ్న తో 2016 నుండి పోలింగ్ కొన‌సాగిస్తోంది. అది ఇంకా కొనసాగుతోంది . అందులోనూ కాబోయే సీయం జ‌గ‌న్ అని  నెటిజెన్లు అనుకూలంగా ఓటింగ్ చేస్తున్నారు. ఇందులో టిడిపి మ‌ద్ద‌తు దారులు ఉన్నారు. 2016  కంటే 2017 లో మ‌రింత‌గా..అతంకంటే 2018 మరింత మెరుగ్గా జ‌గ‌న్ ఓటింగ్ శాతం పెరుగుతోంది. ఏపి లో టిడిపి- బిజెపి క‌లిసి ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్ వైపే నెటిజెన్లు ఓటింగ్ లో మొగ్గు చూపారు. ఆ త‌రువాత 2014 ఎన్నిక‌ల హామీల అమ‌లులో టిడిపి వైఫ‌ల్యం చెందింద‌ని..ఏపి అభివృద్దిలో విఫ‌ల‌మైంద‌ని అధికార పార్టీ పై నెటిజెన్లు త‌మ అభి ప్రాయాల‌ను కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

ఏపి విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ తీరు పైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఇక‌, వైసిపి అధి నేత జ‌గ‌న్ పాద‌యాత్ర ద్వారా అన్ని వ‌ర్గాల‌కు ద‌గ్గ‌ర‌వుతున్న విష‌యాన్ని నెటిజెన్లు తమ అభిప్రాయాల‌ను విశ్లేషించారు. ఇక‌, క‌ర్నాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత కొంత మంది ప‌వ‌న్ క‌ళ్యాన్ అభిమానులు త‌మ అభిప్రాయాల‌ను షేర్ చేసుకు న్నారు. క‌ర్నాట‌క లో జెడిఎస్ త‌ర‌హాలో ఏపిలో జ‌న‌సేన కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని వారు అభిప్రాయ ప‌డ్డారు. టిడిపి కి సంబంధించిన అభిమానులు సైతం ఈ ఓటింగ్ లో త‌మ అభిప్రాయాల‌ను షేర్ చేసుకున్నారు. ఇక‌, తాజాగా చేసిన పోస్టింగ్స్‌లో జ‌గ‌న్ కు ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌నే ఆలోచ‌న బ‌లంగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర ద్వారా అన్ని వ‌ర్గాల‌ను ఆకట్టుకుంటూ బ‌ల‌మైన నేత‌గా ఎదిగార‌నే అభిప్రాయం ఎక్కువ‌గా క‌నిపించింది.  ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రూ ప‌రిశీలించే గుగూల్‌లో ఏపి భ‌విష్య‌త్ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ పేరు క‌నిపించ‌టం పైనా ర‌క‌ర‌కాల ప్రచారాలు జ‌రుగుతున్నాయి. ఇక‌, సాధార‌ణ ప్ర‌జానీకంతో పాటుగా గుగూల్ సైతం ఇప్పుడు దీనినే స‌ర్య్కులేట్ అవటం హాట్ చ‌ర్చ‌గా మారింది. జ‌గ‌న్ ఫ్యాన్స్ ఈ వార్త‌తో మ‌రింత జోష్‌లో క‌నిపిస్తున్నారు.

జంప్ జిలానీల్లో ఆ ఇద్ద‌రే..!! ఆ స‌ర్వే తేల్చింది తెలిస్తే షాకింగే. – Defected MLAs to loose deposits

0

జంప్ జిలానీల్లో ఆ ఇద్ద‌రే..!!
ఆ స‌ర్వే తేల్చింది తెలిస్తే షాకింగే..!!

ఫిరాయింపు ఎమ్మెల్యేల పొలిటిక‌ల్ లైఫ్ రిస్క్‌లో ప‌డిందా.  జంప్ జిలానీల‌ను టిడిపి ఏం చేయ‌బోతోంది. వారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారిలో సీట్లు ఇచ్చేది ఎంత‌మందికి. ఇచ్చినా గెలిచేదెవెరు. ముంద‌స్తు ఎన్నిక‌ల పై చ‌ర్చ జోరుగా సాగుతుండటం తో అధికార పార్టీ పార్టీ ఫిరాయించి త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన 22 మంది విష‌యంలో ఏం చేయాల‌నే దాని పై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్న న‌లుగురిలో ఇద్ద‌రు మాత్ర‌మే సంతృప్తి గా ఉన్నారు. మిగిలిని ఇద్ద‌రు పేరుకు మాత్ర‌మే మంత్రులుగా చెలామ‌ణి అవుతున్నారు. ఇక‌, మిగిలిన ఎమ్మెల్యేల్లో ఒకరికి నామినేటెడ్ ప‌ద‌వి ద‌క్కింది. ఇక మిగిలిని ఎమ్మెల్యేల్లో అనేక మంది తాము పార్టీ ఎందుకు ఫిరాయించామా అనే ప‌శ్చాత్తాపం ప‌డే ప‌రిస్థితుల్లో ఉన్నారు.

పార్టీ కార్య‌క్ర‌మాల్లో అసంతృప్తుల బెడ‌ద‌..త‌మ‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌టం..ఏ ప‌ని మీద వెళ్లినా ప‌ట్టించుకోని ప‌రిస్థితుల్లో ఇరుక్కుపోయారు. అటు డిడిపిలో ఉండ‌లేక‌..ఇక తిరిగి వైసిపికి రాలేక స‌త‌మ‌తమ‌వుతున్నారు. క‌ర్నూలు జిల్లా కు చెందిన ఎమ్మెల్యే మ‌ణిగాంధీ లాంటి వారు ఈ విష‌యాన్ని ఓపెన్ గానే చెబుతున్నారు. ఇక‌, క‌డ‌ప‌-క‌ర్నూలు- ప్ర‌కాశం జిల్లాకు చెందిన జంప్ జిలానీల ప‌రిస్థితి అదే విధంగా ఉంది. అద్దంకి లాంటి ప్రాంతాల్లో నేత‌లు బాహా బాహీకి దిగుతన్నారు. ఇక‌, 22 మంది జంప్ జిలానీలు ఉండ‌టంతో..ఎంత మందికి టిక్కెట్లు ఇవ్వాలి..వారిలో ఎంత మంది గెలుస్తార‌నే అంశం పై తాజాగా అధికార పార్ట ఓ ప్ర‌ముఖ సంస్థ‌తో స‌ర్వే చేయించింది. అందులో మెజార్టీ స‌భ్యుల అవే స్థానాల్లో తిరిగి పోటీ చేస్తే గెలిచే అవ‌కాశం లేద‌ని ఆ సర్వే తేల్చి చెప్పిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో ఏ ఒక్క‌రు గెల‌వ‌ర‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. ఇక‌, మంత్రులుగా ఉన్న న‌లుగురిలో విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజ‌య రంగారావు, చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు ఎమ్మెల్యే.. ప్ర‌స్తుత మంత్రి అమ‌ర‌నాధ రెడ్డి మ‌త్ర‌మే తిరిగి గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని.

ప్ర‌భుత్వ పెద్ద‌లు చేయించిన సీక్రేట్ స‌ర్వేలో తేలిన‌ట్లు విశ్వ‌సనీయ స‌మాచారం. ఇది ఇప్పుడు జంప్ జిలానీల‌ను ప‌రీక్ష‌గా మారింది. ఈ స‌ర్వే వారికి లీక్ కావ‌టంతో రాజ‌కీయంగా త‌మ భ‌విష్య‌త్ ఏంట‌నే టెన్ష‌న్ వారిలో పెరిగిపోతోంది. త‌మ భ‌విష్య‌త్ అగ‌మ్య‌గోచ‌రంగా మారిపోయింద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఇక‌, వీరు సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాల్సిందేనా.

అసంతృప్తుల ఆక‌స్మిక క‌ల‌యిక‌..దీని వెనుక అసలు క‌ధ‌- Unsatisfying Accidental Meeting TDP group war Favouring YCP

0

అసంతృప్తుల ఆక‌స్మిక క‌ల‌యిక‌..దీని వెనుక అసలు క‌ధ‌..!!
టిడిపి లో వైసిపి అనుకూల స‌మీక‌ర‌ణాలు..ఊహించ‌గ‌ల‌రా..!!

టిడిపిలో జ‌రుగుతున్న ప‌రిణామాలు వైసిపికి క‌లిసి వ‌స్తాయా. వైసిపి వీటిని అనుకూలంగా మ‌ల‌చుకోగ‌ల‌దా. టిడిపి లో అస‌మ్మ‌తి నేత‌లు ఒక్క‌ట‌వుతున్నారా. వీరంతా టిడిపి హైక‌మాండ్ కు ఇస్తున్న సంకేతాలేంటి. కొద్ది రోజులుగా టిడిపిలో సీనియ‌ర్ నేత‌ల్లో అసంతృప్త‌లు బాగా క‌నిపిస్తున్నారు.

గ‌తంలో క్యాబినెట్ విస్త‌ర‌ణ స‌మ‌యంలో ఎవ‌రైతే అసం తృప్తితో ఉన్నారో వారంద‌రికీ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్దులో స్థానం క‌ల్పించి బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు టిడిపి అధి నాయక‌త్వం చేసింది. కానీ, ఇప్పుడు చాప కింద నీరులా సాగుతున్న ప‌రిణామాలు టిడిపికి మింగుడు ప‌డ‌టం లేదు. ముఖ్యంగా క‌ర్నూలు-అనంత‌పురం వంటి జిల్లాల్లో టిడిపి నేత‌లు ఎవ‌రి దారి వారిదే అన్న‌ట్లుగా సాగుతున్నారు. స్వ‌యంగా పార్టీ అధినేత వీరితో ప‌లుమార్లు భేటీలు ఏర్పాటు చేసినా ప‌రిస్థితిలో మార్పు క‌నిపించ‌టం లేదు. ఇక‌, ముంద‌స్తుగానే ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని భావిస్తున్న స‌మ‌యంలో ఇవి మ‌రింత‌గా టిడిపిని టెన్ష‌న్ పుట్టిస్తున్నాయి. ఏకంగా క్యాబినెట్ మంత్రి గంటా శ్రీనివాస‌రావు తాత్కాలికంగా మొత్త‌బ‌డిన‌ట్లు క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ..స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. ఇక‌, ఇదే గంటా శ్రీనివాస‌రావు నెల్లూరులో టిడిపి నేత ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి తో స‌మావేశం కావ‌టం ఇప్పుడు పార్టీలో హాట్    టాపిక్ గా మారింది.

ఆనం ను బుజ్జ‌గించేందుకు గంటాను పంపార‌ని టిడిపి మ‌ద్ద‌తు మీడియా చెబుతున్నా..ఆనం ను బుజ్జ‌గించేంత సాన్నిహిత్యం వారిద్ద‌రి మ‌ధ్య లేద‌నేది పార్టీ నేత‌లే చెబుతున్నారు. గంటా పార్టీ నేత‌ల తీరుపై అస‌హ‌నంతో ఉన్న విష‌యం తెలిసిందే. కొంత కాలంగా ఆనం రామనారాయ‌ణ రెడ్డి సైతం టిడిపి అధినాయ‌క‌త్వం పై ఓపెన్ గా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడు, త‌మ వైఖ‌రి ఏంటో తెలియ‌చేయ‌టానికే గంటా వ్యూహాత్మ‌కంగా ఆనంతో స‌మావేశం అయిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇదే నెల్లూరు జిల్లాలో ఆదాల‌, ప్ర‌కాశంలో మాగుంట శ్రీనివాస‌రెడ్డి, క‌డప-క‌ర్నూలు-అనంత‌పురం జిల్లాల్లోని ప‌లువురు నేత‌లు పార్టీ తీరు పై అసంతృప్తితో ఉన్నారు. అయితే, పార్టీ అధికారంలో ఉండ‌టంతో స‌మ‌యం కోసం వారంతా ఎదురు చూస్తున్నార‌నే చ‌ర్చపార్టీలో జ‌రుగుతోంది.

గంటా రాజ‌కీయంగా ఏదైన నిర్ణ‌యం తీసుకుంటే..విశాఖ లో ఆయ నను అనుస‌రించేవారు పెద్ద సంఖ్య‌లోనే ఉంటారు. ఇక‌, నెల్లూరు లో ఆనం టిడిపిని అధికారికంగా వీడ‌ట‌మే మిగిలింది. ఇప్పుడు వీరిద్ద‌రి ఆక‌స్మిక క‌ల‌యిక అనేక సందేహాల‌కు అవ‌కాశం ఇస్తోంది. ఎన్నిక‌లు స‌మీపించే వేళ‌..టిడిపిలో పెరుగుతున్న అసంతృప్తుల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకొనేందుకు వైసిపి అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే ఆనం, గంటా లాంటి వారు వైసిపి తో ట‌చ్ లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో..అధికార పార్టీని టెన్ష‌న్ పెట్టేందుకు వైసిపి రానున్న రోజుల్లో ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.