Home Blog Page 21

టిడిపి పై జెసి అస‌లు ఆలోచ‌న అదేనా – JC became head ache to TDP

0

టిడిపి నేత‌ల‌ను జెసి టార్గెట్ చేయ‌టం వెనుక‌..!!

జెసి టిడిపికి వ‌ర‌మా..లేక శాప‌మా.  జెసి దివాక‌ర రెడ్డి..ప్ర‌భాక‌ర రెడ్డి ఇద్ద‌రూ 2014 ఎన్నిక‌ల ముందు టిడిపిలో చేరి ఒక‌రు ఎంపీగా..మ‌రొక‌రు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. వారిద్ద‌రి మాట తీరు ఇప్పుడు పార్టీలో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌తంలో జ‌గ‌న్ పై నోరు పారేసుకున్న జెసి ప్ర‌భాక‌ర‌రెడ్డి తీరు పై సామాన్య ప్ర‌జ‌ల్లోనూ వ్య‌తిరేక‌త వ్య‌క్తం అయింది. జ‌గ‌న్ ను దూషించాడ‌ని టిడిపి శ్రేణులు సంబ‌ర‌ప‌డినా..అది బూమ్‌రాంగ్ అయింది. ఇక‌, జెసి దివాక‌రరెడ్డి శైలి వేరు. ప్ర‌భుత్వంలో త‌న‌కు త‌గిన గుర్తింపు లేద‌ని భావించిన ప్ర‌తీ సంద‌ర్భంలోనూ పార్టీని ఇరుకున పెట్టే వ్యాఖ్య‌లు చేయ‌టం ఆయ‌న‌కు కొత్త కాదు. మ‌హానాడు వేదిక‌గా పార్టీ అధినేత‌ను దులిపేసారు. త‌న‌ను అడ్డుకోబోయిన ఎంపి రామ్మోహ‌న్ నాయ‌డును ప‌క్క‌కు నెట్టేసారు.

మ‌హానాడు వేదిక‌గా నేరుగా ముఖ్య‌మంత్రినే ల‌క్ష్యంగా చేసుకొని జెసి దివాకర‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు పార్టీ నేత‌లకే మింగుడు ప‌డలేదు. ఇక‌, ప్ర‌తీ సంద‌ర్భంలోనూ జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌టం ద్వారా ముఖ్య‌మంత్రి మెప్పు పొందే ప్ర య‌త్నం చేస్తూనే ఉంటారు. వైయ‌స్ రెండో ద‌ఫా ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత జెసికి క్యాబినెట్ లో స్థానం కల్పించ‌లేదు. అప్ప‌టి నుండి వైయ‌స్ మీద‌..ఆయ‌న కుటుంబం మీద జెసి వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్నారు. ఇక‌, అనంత‌పురం రాజ‌కీయాల్లోనూ త‌న వ‌ర్గం కోసం పార్టీలోని ఇత‌ర నేత‌ల పై చేస్తున్న అస‌మ్మ‌తి రాజ‌కీయం సైతం జిల్లా టిడిపి నేత‌ల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. ముఖ్య‌మంత్రికి ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకొనే ప‌రిస్థితి లేదు. ఇక‌, ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం క‌డ‌పలో రాజ్య‌స‌భ స‌భ్యుడు సీయం ర‌మేష్ దీక్ష చేస్తుండ‌గా..అక్క‌డికి వెళ్లిన జెసి దివాక‌ర్ రెడ్డి దీక్ష చేసినా..ఉక్కు కాదు..తుక్కు కూడా రాద‌ని తేల్చి చెప్పేసారు. దీక్ష మాని భోజ‌నం చేయాల‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. దీక్ష ద్వారా ఎంతో కొంత మైలేజ్ సాధిద్దామ‌ని భావించిన టిడిపి నేత‌ల‌కు ఇది మింగుడు ప‌డ‌లేదు. వెంట‌నే మంత్రి ఆదినారాయ‌ణ ..దివాక‌ర రెడ్డి పై ఓపె న్ గానే అసంతృప్తి వ్య‌క్తం చేసారు. ఇక‌, జిల్లాలో త‌న కుమారుడు, తన వ‌ర్గం కోసం ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల పై జెసి ప‌లు మార్లు వివాదాస్ప‌ద కామెంట్లు చేసారు. కొంత కాలంగా ప్ర‌భాక‌ర రెడ్డి నోటి దురుసుత‌నం త‌గ్గిన‌ట్లుగా క‌నిపిస్తున్నా.. జెసి దివాక‌ర రెడ్డి తీరు మాత్రం మార‌టం లేదు. దీంతో..జెసి టిడిపిని ముంచ‌టానికి పార్టీలోకి వ‌చ్చారా..లేక‌..పార్టీ కోసం మాట్లాడుతున్నారా అనే చ‌ర్చ ఇప్పుడు టిడిపి లోనే కొన‌సాగుతోంది.

ముందస్తు ఎన్నికలకు సై అంటే సై – Early polls for AP Assembly

0

టిడిపి ముంద‌స్తు నిర్ణ‌యాలు…సై అంటున్న వైసిపి..
తెర వెనుక జ‌రుగుతోంది ఇదే..!!

ముంద‌స్తు ఎన్నిక‌ల కోస‌మేనే ముఖ్య‌మంత్రి ఈ హ‌డావుడి నిర్ణ‌యాలు. జ‌గ‌న్ ను ఎదుర్కోవ‌టం కోస‌మా. ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయంగా క‌నిపిస్తున్నాయి. మ‌రి..ఏపిలో ఏం జ‌రుగ‌బోతోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల తో పాటుగానే ఏపి అసెంబ్లీ ఎ న్నిక‌ల ముంద‌స్తు నిర్వ‌హ‌ణ‌కు అధికార పార్టీ సిద్దంగా ఉందా. వ‌చ్చే డిసెంబ‌ర్- జ‌న‌వ‌రలో పార్ల‌మెంట్ కు ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయ‌మ‌ని ఢిల్లీ నుండి అందుతున్న అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇదే స‌మ‌యంలో జ‌మిలి ఎన్నిక‌ల దిశ‌గా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది.

ఏపిలో నెల‌కొన్ని రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా వైసిపి సిద్ద‌మ‌ని చెబుతోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటుగా పలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌టం ఖాయ‌మ‌ని ఢిల్లీలోని ప్ర‌ము ఖులు స్ప‌ష్టం చేస్తున్నారు. అయితే, జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌తిపాద‌న‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి సుముఖంగా ఉన్నారు. బిజెపితో తెగ తెంపులు చేసుకున్న త‌రువాత ఇప్పుడు ఏపి ముఖ్య‌మంత్రి కేంద్ర ప్ర‌తిపాద‌న‌కు అనుకూలంగా మ‌ద్ద‌తి స్తారా అంటే సందేహ‌మే. అయితే, ముఖ్య‌మంత్రి ఢిల్లీ టూర్ త‌రువాత అక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాల పై స్ప‌ష్ట‌మైన అంచ‌నాకు వ‌చ్చారు. ఎన్నిక‌ల మాజీ క‌మిష‌న‌ర్ బ్ర‌హ్మ ఇప్ప‌టికే జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌తిపాద‌న పై సీరియ‌స్ గా క‌స‌ర‌త్తు చేస్తున్నారు.ఈ స‌మాచారంతో ముఖ్య‌మంత్రి సైతం ముంద‌స్తుగానే పార్ల‌మెంట్ ఎన్నిక‌లు త‌ప్ప‌వ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన ట్లు స్ప‌ష్ట‌మైన స‌మాచారం. దీంతో..ఎన్నిక‌ల హామీల‌కు ఒక్కొక్క‌టిగా ప‌రిష్క‌రిస్తున్నామ‌నే విధంగా ప్ర‌జ‌ల్లోకి సంకేతాలు ఇస్తున్నారు, అంగ‌న్ వాడీల జీతాలు పెంచారు.

అయితే, తాజాగా స‌ర్వేలు అధ్య‌య‌నం చేస్తే..పూర్తిగా వైసిపి అధిప‌త్యం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే దాదాపు ఏడు నెల‌ల‌కు పైగా ప్ర‌జ‌ల్లోనే ఉంటూ పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ పై ప్ర‌జ‌ల్లో సానుకూల సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్య‌తిరేక‌త‌తో పాటుగా..వైసిపి కి పెరుగుతున్న ప్ర‌జాద‌ర‌ణ..ఎమ్మెల్యేల పై ప్ర‌జ‌ల్లో నెల‌కొన్ని అసంతృప్తి ఇప్పుడు అధికార పార్టీకి ఇబ్బందిగా మారాయి. అయితే, ఏపి శాస‌న‌స‌భ‌కు ఇప్పుడున్న ప‌రిస్థితుల మేర‌కు ముంద‌స్తుకు అధికార పార్టీ సాహ‌సం చేయ‌క‌పోయినా..లోక్‌స‌భ ఎన్నిక‌లు ఎదుర్కోక త‌ప్ప‌దు. అందులో ఏ ఎదుర య్యే ఫ‌లితాలు ఏపి శాస‌న‌స‌భ ఎన్నిక‌ల పై స్ప‌ష్టంగా ప్ర‌భావం చూపిస్తాయి. దీంతో..అధికార పార్టీ ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం స‌మాయ‌త్తం అవుతున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రి కొద్ది రోజుల్లోనే ముంద‌స్తు లోక్‌స‌భ ఎన్నిక‌ల పై స్ప‌ష్ట‌త రానుంది. ఏపిలో ఏం జ‌రిగే అవ‌కాశం ఉంది..ముంద‌స్తుగా పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌రిగితే వైసిపి ప‌రిస్థితి ఏంట‌నే దాని పై క్షేత్ర స్థాయి స‌మాచారం ఆధారంగా మీ అభిప్రాయాలు తెలియ చేయండి.

జ‌గ‌న్‌- ప‌వ‌న్ క‌లుస్తారా.. ఏం జ‌రుగుతోంది. – Jagan pavan allience on cards

0

వైసిపి అభిమానులు స్పందించాలి.  వచ్చే ఎన్నిక‌ల్లో వైసిపి పొత్తు ఎవ‌రితో. ఒంట‌రి పోరుకే జ‌గ‌న్ మొగ్గు చూపుతున్నారు. కానీ, అంత‌ర్గ‌తంగా వైసిపి లో అనేక చ‌ర్చ‌లు నడుస్తున్నాయి. పొత్తు ఎవ‌రితో పెట్టుకోవాలి.  కాంగ్రెస్ – బిజెపి ల‌తో క‌లిసి ఎన్నిక‌ల్లో అడుగు వేసే అవ‌కాశం లేనే లేదు. ఇక‌, వామ‌ప‌క్షాలు ప‌వన్ తో ఉన్నాయి. సీపియం వైసిపి వైపు ఆస‌క్తిగా ఉన్నా అది ఎంత వ‌ర‌కు ఎన్నిక‌ల్లో మేలు చేస్తుంద‌నేది ఇప్పుడే చెప్ప‌లేని ప‌రిస్థితి. అటు టిడిపి నేత‌లు మాత్రం ఇచ్చే ఎన్నిక‌ల నాటికి జ‌రిగే ప‌రిణామాలు త‌మ‌కు స‌హ‌క‌రిస్తాయ‌ని ధీమాగా చెబుతున్నారు. వ‌చ్చేది సంకుల స‌మ‌రమంటూనే.. అనేక పార్టీలు పొత్తులు లేకుండా బ‌రిలోకి దిగ‌టం ద్వారా..బ‌హుముఖ పోరు జ‌రుగుతుంద‌ని టిడిపి నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. ఫ‌లితంగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోతుంద‌ని..తాము తిరిగి అధికారంలోకి రావాటం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఇక‌, పోల్ మేనేజ్‌మెంట్‌..పొలిటిక‌ల్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అధికారంలో ఉండ‌టంతో త‌మ‌కే క‌లిసి వ‌స్తాయ‌ని వారు ఈలెక్క‌ల‌న్నీ చెప్పుకొస్తున్నారు. ఇదే స‌మ‌యంలో..టిడిపి వ్య‌తిరేక ఓటు చీల‌కుండా ఉండాలంటే..జ‌గ‌న్ – ప‌వ‌న్ తో క‌ల‌వా ల‌ని కొంద‌రు సీనియ‌ర్ పొలిటిషియ‌న్లు సూచ‌న చేస్తున్నారు. దీని కార‌ణంగా.. హోదా సెంటిమెంట్ తో పాటుగా టిడిపిని అడ్ర‌స్ లేకుండా చేయ‌గ‌లుగుతార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ప‌వ‌న్ తాను ఇప్ప‌టికే సీయం అభ్య‌ర్ధిని కాన‌ని ప్ర‌చారం చేసు కుంటున్నార‌ని..ఇద్ద‌రి ఉమ్మ‌డి శ‌త్రువు టిడిపి నే కాబ‌ట్టి..ఈ ప్ర‌యోగం ద్వారా..ఓట్ల చీలిక‌ను నివారించి టిడిపి అధికారం లోకి రాకుండా చేయ‌వ‌చ్చేనేది వారి వాద‌న‌. అయితే, జ‌గ‌న్ మ‌ద్ద‌తుదారులు మాత్రం  ఒంట‌రి పోరు ద్వారా తాము ఈ సారి గెల‌వ‌టం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

పొత్తు అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ – ప‌వ‌న్ క‌ల‌వ‌టం…జ‌న‌సేన కు కొన్ని సీట్లు కేటాయించ‌టం ద్వారా జ‌గ‌న్ ల‌బ్ది పొందుతార‌ని వారు విశ్లేషిస్తున్నారు. ఈ ప్ర‌తిపాదన పై రెండు పార్టీల్లోని కొంద‌రు నేత‌లు చ‌ర్చ‌లు చేస్తున్నా..జ‌న‌సేన నుండి అవున‌ని..కాద‌ని సంకేతాలు రావ‌టం లేదు. ఇక‌, వైసిపి నేత‌లు మాత్రం కార్య‌క‌ర్త‌ల్లో ఎటువంటి గంద‌రగోళం లేకుండా వైసిపి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. మ‌రి..జ‌గ‌న్ అభిమానుల అంచ‌నాలు ఏంటి. వారి సూచ‌న‌లు ఏంటి.  జ‌గ‌న్ కు పొత్తు అవ‌స‌ర‌మా.. టిడిపిని ఓడించా లంటే న‌వ్ ఆర్ నెవ‌ర్ అనే రీతిలో సాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ -ప‌వ‌న్ క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఉందా..ఇక‌, మీరే కామెంట్ల రూపంలో స్పందించండి…

టిడిపి లో ఆంధ్ర‌జ్యోతి క‌ధ అడ్డం తిరిగింది – The story of Andhrajothi is Fully Upset to TDP

0

టిడిపి లో ఆంధ్ర‌జ్యోతి క‌ధ అడ్డం తిరిగింది.

ఆంధ్ర‌జ్యోతి స‌ర్వే టిడిపికి త‌ల నొప్పులు తెచ్చి పెట్టిందా? అవున‌నే చెబుతున్నాయి పార్టీ వ‌ర్గాలు. ప‌రిస్థితి అధికార పార్టీకి అనుకూలంగా ఉంద‌ని చెబుతూ మూడు రోజుల క్రితం ఆంధ్ర‌జ్యోతి స‌ర్వే ప్ర‌చురించింది. అయితే, సాధార‌ణంగా ఆ ప‌త్రికలో ప్ర‌భుత్వంలోని కొంద‌రు ప్ర‌ముఖుల సూచ‌న‌ల మేర‌కే క‌ధ‌నాలు వ‌స్తాయ‌ని ఆ పార్టీ నేత‌లు బాగా న‌మ్మే అంశం. ఇక‌, ఇప్పుడు అదే న‌మ్మ‌కం పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్ల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. ఏకంగా మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భీమిలి లో గంటా పై వ్య‌తిరేక‌త ఉంద‌నే క‌ధ‌నం ఇప్పుడు గంటాను ఏకంగా పార్టీకి దూరంగా జ‌రిగే ప‌రిస్థితి తీసుకొచ్చింది.

ఆంధ్ర‌జ్యోతి అంత ప్ర‌ముఖుంగా టిడిపికి అనుకూలంగా స‌ర్వే ప్ర‌చురించినా..టిడిపి నేత‌లు దానిని త‌మ‌కు అనుకూలంగా ప్ర‌చారం చేసుకొనే ప‌రిస్థితిలో లేరు. టిడిపి నేత‌లు సైతం ఈ స‌ర్వేను లైట్ గా తీసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, వైసిపి నేత‌లు ఈ సర్వేను త‌ప్పు బ‌డుతున్నారు. వైసిపి ఎంపి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ ద్వారా ల‌గ‌డ‌పాటి ఎటువంటి స‌ర్వే ఆంధ్ర‌జ్యోతి కోసం చేయ‌లేద‌ని ప్ర‌క‌టించారు. దీంతో..ఈ సర్వే నిబద్ద‌త పైన‌మ్మ‌కం కోల్పోయింది. ఇక‌, గంటా తో పాటుగా రాయ‌ల‌సీమ కు చెందిన టిడిపి నేత‌లు సైతం ఈ స‌ర్వే పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

విశాఖ‌లో జ‌రుగుతున్న వ‌ర్గ పోరులో భాగంగానే త‌న‌ను లక్ష్యంగా చేసుకొని అధికార పార్టీలో పావులు క‌దుపుతున్నార‌నే అనుమానం గంటా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ అనుమానాల‌తోనే గంటా క్యాబినెట్ స‌మావేశానికి సైతం గైర్హాజ‌ర‌య్యారు. దీని పై బుజ్జ‌గింపులు సైతం ప్రారంభ‌మైన‌ట్లు స‌మాచారం. గంటాను రాజ‌కీయంగా నైతికంగా దెబ్బ తీయ‌టంలో భాగంగానే ఈ స‌ర్వేను పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్లు చేయించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గంటా పార్టీ వీడేందుకు సిద్ద‌మ‌య్యార‌ని.. ఆయ‌న జ‌నసేన వైపు చూస్తున్నార‌నే స‌మాచారంతో..ఆయ‌న్ను దెబ్బ తీసేందుకే ఈ స‌ర్వే ద్వారా ఎత్తులు వేసార‌ని గంటా స‌న్నిహితులు ఆరోపిస్తున్నారు. టిడిపికి టానిక్ లా ప‌ని చేస్తుంద‌ని భావించిన ఆంధ్ర‌జ్యోతి స‌ర్వే ఇప్పుడు టిడిపి కే కొత్త స‌మ‌స్య‌లు తెచ్చి పెడుతోంది.

సాయి రెడ్డి స‌త్తా ఆర్కేకు తెలిసొచ్చిందా. – ABN RK realised the value of Vijayasai Reddy

0

సాయిరెడ్డి పై ఆర్కే అభిమానం..
ఎందుకీ స‌డ‌న్ ఛేంజ్‌..!!
కొత్త ప‌లుకులో కొత్త కోణం..!!
సాయి రెడ్డి స‌త్తా తెలిసొచ్చిందా..!!

కొత్త ప‌లుకులో కొత్త కోణం.వైసిపి నేత విజ‌య సాయి రెడ్డికి ఆంధ్ర‌జ్యోతి ఆర్కే అభినంద‌న‌లు. త‌న కొత్త ప‌లుకులో విజ‌య సాయిరెడ్డి ని కీర్తించారు. ఏంటీ స‌డ‌న్ ఛేంజ్. విజ‌య సాయిరెడ్డి పై ఆర్కేకు ఎందుకు అంత స‌డ‌న్ గా స‌ద‌భిప్రాయం ఏర్ప‌డింది. ప్ర‌తీ వారం త‌న కొత్త ప‌లుకులో వైసిపి నేత‌లు..ప్ర‌ధానంగా జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా కామెంట్లు రాస్తూ..టిడిపి అధి నేత‌ను ఆకాశానికి ఎత్తే ఆర్కే ఈ సారి కొత్త ప‌లుకులో కొత్త కోణం ప్ర‌ద‌ర్శించారు. జ‌గ‌న్ గురించి రాస్తూ జ‌గ‌న్ గ్రేటే ..మ‌రి అంటూ త‌న దైన శైలిలో స‌హ‌జ సిద్దంగా త‌న వ్యాసంలో కామెంట్లు జోడించారు. ఇక‌, ఈ సారి వైసిపి రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయిరెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

చంద్ర‌బాబు వ్య‌తిరేకుల‌ను ఏకం చేయ‌టంతో విజ‌య సాయి రెడ్డి కృషిని అభినందించాల‌ని ఆర్కే పేర్కొన్నారు. చంద్ర‌బాబు పై ఇటీవ‌ల కాలంలో విరుచుకుప‌డుతున్నారంటూ రాసుకొ చ్చారు. క‌న్నా విష‌యంలో అమిత్ షా విజ‌య సాయిరెడ్డి ద్వారానే ఆయ‌న్ను వైసిపి లో చేర‌కుండా ఆప‌గ‌లిగార‌ని రాస్తూనే అమిత్ షా తో ఉన్న సంబంధాల‌ను ఎత్తి చూపారు. ఒక్కొక్క‌రు ఒక్కో ద‌శ‌లో రాజ‌కీయాల్లో రాణిస్తుంటార‌ని..ఇప్పుడు విజయ సాయిరెడ్డి వంతు వ‌చ్చింద‌ని కీర్తించారు. వైసిపి రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించ‌ట‌మే కాకుండా.. టిడిపి నేత‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నార‌ని గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా సాయి రెడ్డి గురించి త‌న అభిప్రాయం చెప్పే ప్ర‌య‌త్నం చేసారు.

జ‌గ‌న్ ను ముఖ్య‌మంత్రిని చేయ‌ట‌మే ల‌క్ష్యంగా విజ‌య సాయి రెడ్డి ప‌ని చేస్తున్నార‌ని..ఏపి రాజ‌కీయా ల్లో ప్ర‌ముఖుడిగా చ‌లామ‌ణి అవుతున్నార‌ని త‌న కొత్త ప‌లుకులో పేర్కొన్నారు. ఇప్పుడు ఇది టిడిపి నేత‌ల‌కు రుచించ‌టం లేదు. త‌మ‌ను అనేక స‌వాళ్ల‌తో ఇబ్బంది పెడుతున్న విజ‌య సాయిరెడ్డి పై త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిలిచే ఆర్కే ఈ విధంగా స‌డ‌న్ గా ఆయ‌న పై త‌న వైఖ‌రి మార్చుకున్న‌ట్లుగా స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. అయితే, గ‌తంలో విజ‌య సాయిరెడ్డి పై అనేక వ్య‌తిరేక క‌ధ‌నాలు వ‌చ్చిన ప‌త్రిక‌లోనే..ఇంత‌లా సాయిరెడ్డి పార్టీ కోసం చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఆనుకూలంగా వ్యాఖ్యానాలు రాయ‌టం వెనుక కార‌ణాలు ఏంట‌నే దాని పై వైసిపి నేత‌ల కంటే టిడిపి నేత‌లు ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. ఏది ఏమైనా..కార‌ణం ఏమున్నా..సాయి రెడ్డి టిడిపి నేత‌ల‌కు ఏ ర‌కంగా చుక్కులు చూపిస్తుందీ..ఆర్కే ఒప్పుకోక త‌ప్ప‌లేదు.

ఆ నిర్ణయం తో ఇక వార్ వన్ సైడ్ అయినట్లే – Historical Decision by Jagan in Padayatra

0

ముహూర్తం ఖారారైంది. సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా వైసిపి అధినేత జ‌గ‌న్. పాదయాత్ర కు గ్రాండ్ ముగింపు ఇచ్చేందుకు జ‌గ‌న్ సిద్ద‌మ‌య్యారు. అక్టోబ‌ర్ 6, 2017 న ప్రారంభ‌మైన పాదయాత్ర ఇప్ప‌టికే తొమ్మ‌ది జిల్లాల్లో పూర్త‌యింది. ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాల్లో సాగుతోంది. ఈ జిల్లాల్లో జులై మొద‌టి వారం వ‌ర‌కు సాగే అవ‌కాశం ఉంది .ఆ త‌రువాత విశాఖ జిల్లా లో ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్నారు. ఆ జిల్లాలో టిడిపి నుండి భారీ చేరిక‌లు వైసిపిలోకి ఉండ‌నున్నాయి. 2014 ఎ న్నిక‌ల్లో వైసిపికి అక్క‌డ న‌ష్టం జ‌రిగింది. దీంతో..ఈ సారి విశాఖపై వైసిపి అధినేత తొలి నుండి ప్ర‌త్యేక దృష్టి సారించారు.

అధికార పార్టీలో నెల‌కొన్ని గ్రూపు రాజ‌కీయాలు వైసిపి బ‌లంగా మారుతున్నాయి. ఉత్త‌రాంధ్ర లో వైసిపి గ‌తం కంటే బ‌లంగా ఉన్న‌ట్లు తాజా స‌ర్వేలు సైతం వెల్ల‌డిస్తున్నాయి. విశాఖ -విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన వైసిపి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అక్క‌డ కొత్త నేత‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్నారు. ఇక‌, జులై మొద‌టి వారంలో విశాఖ‌లో ప్రారంభ మ‌య్యే పాద‌యాత్ర‌ను ఆగ‌స్టు చివ‌రి నాటికి విశాఖ‌-విజ‌య‌న‌గ‌రం-శ్రీకాకుళం జిల్లాల్లో పూర్తి  చేసేలా ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్నారు. వైయ‌స్ మ‌ర‌ణించిన రోజు అయిన సెప్టెంబ‌ర్ 2న ఇచ్చాపురం లో పాద‌యాత్ర ముగించాల‌ని సూత్ర ప్రాయం గా నిర్ణ‌యించారు. అదే రోజు అక్క‌డే భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. దాదాపు మూడు వేల కిలో మీట ర్లు..11 నెల‌ల పాటు సాగించిన పాద‌యాత్ర‌కు గుర్తుగా స‌భ‌తో పాటుగా…పార్టీ తొలి నుండి పోరాడుతున్న ప్ర‌త్యేక హోదా కు మ‌ద్ద‌తుగా కీల‌క నిర్ణ‌యం తీసుకోవాల‌ని పార్టీ యోచిస్తోంది. ఇక‌, ముంద‌స్తు ఎన్నిక‌ల దిశ‌గా కేంద్రం ఆలోచ‌న చేస్తున్న ఈ స‌మ‌యంలో కేంద్రం పై ఒత్తిడి పెంచేలా రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాల‌నేది పార్టీ యోచ‌నగా తెలుస్తోంది. ఈ నిర్ణ‌యాన్ని పాద‌యాత్ర ముగింపు రోజున జ‌రిగే భారీ బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌నున్నారు. అయి తే, ఈ నిర్ణ‌యం ద్వారా..టిడిపి కి కొత్త అస్త్రం ఇచ్చిన వార‌వుతార‌ని..ఫిరాయింపు ఎమ్మెల్యేల తో టిడిపి కొత్త రాజ‌కీయం చేసే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతున్నా..జ‌గ‌న్ వాటిని ఖాత‌రు చేయ‌టం లేదు. ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామా చేసిన త‌రువాత టిడిపి ఏం చేసినా..ప్ర‌జ‌ల్లో మ‌రింత‌గా డామేజ్ అవుతార‌ని..తాము సిన్సియ‌ర్‌గా పోరాటం చేద్దామ‌ని జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌తో చెబుతున్నారు. దీంతో..ఇడుపుల పాయ‌లో ఘ‌నంగా ప్రారంభ‌మైన పాద‌యాత్ర అంతే ఘ‌నంగా ఇచ్ఛాపురంలో ముగించే దిశ‌గా కార్యాచ‌ర‌ణ సిద్ద‌మ‌వుతోంది. దీంతో..రికార్డు స్థాయిలో సాగిన పాద‌యాత్ర లో సంచ‌ల‌న నిర్ణ‌యం ద్వారా..ఏపి రాజ‌కీయాల్లో కొత్త చ‌రిత్ర సృష్టించ‌టానికి సిద్దమ‌వుతున్నారు.

అక్క‌డ టిడిపిలో ఉండేదెవ‌రు..వైసిపి లోకి వ‌చ్చేదెవ‌రు. – Ganta and avanthi planning to change the party

0

ఆ ఇద్ద‌రిలో ఒక‌రే టిడిపిలో . మ‌రొక‌రు ఏ పార్టీలోకి. ఇప్పుడు విశాఖ జిల్లా రాజ‌కీయాల్లో అదే హాట్ టాపిక్. ఒక‌రు మంత్రి గంటా శ్రీనివాస‌రావు. మ‌రొక‌రు ఎంపి అవంతి శ్రీనివాస‌రావు. ఇద్ద‌రిది ప్ర‌జారాజ్యం నుండి ఒక‌టే మాట‌..ఇక‌టే బాట‌. కానీ, కొంత కాలంగా ఇద్ద‌రి మ‌ధ్య పొలిటిక‌ల్ కోల్డ్ వార్ జ‌రుగుతోంది. ఇద్ద‌రూ ఒక‌టే నియోజ‌క‌వ‌ర్గం కోరుకుంటున్నారు. భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుండి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నేది ఎంపి అవంతి ఆలోచ‌న‌. అయితే, ఎటువంటి ప‌రిస్థితుల్లోనూ భీమిలిని వీడేది లేద‌ని గంటా స్ప‌ష్టం చేస్తున్నారు.

విశాఖ కు ప్ర‌త్యేక రైల్వే జెన్ కోసం అవంతి ఇప్ప‌టికే దీక్ష‌లు సైతం చేస్తున్నారు. గంటా వ్య‌తిరేక వ‌ర్గం తోనూ అవంతి స‌ఖ్య‌త‌గా ఉంటున్నారు. మంత్రులు గంటా వ‌ర్సెస్ అయ్య‌న్నపాత్రుడు అన్న‌ట్లుగా జిల్లా రాజ‌కీయాలు ఎప్ప‌టి నుండో ట‌ర్న్ తీసుకున్నాయి. విశాఖ భూ కుంభ‌కోణంలోనూ ఇద్ద‌రూ ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. ఇక‌, రాజ‌కీయాల్లో సీజ‌న్ ను అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే ఈ నేత‌లు ఇప్పుడు ఒక‌టే నియోజ‌క‌వ‌ర్గం కోసం అప్పుడే లాబీయింగ్ ప్రారంభించారు. త‌న‌కు భీమిలి కేటాయించ‌క‌పోతే పార్టీ వీడ‌టానికి సైతం వెనుకాడ‌న‌ని అవంతి ఇప్ప‌టికే పార్టీ అధినాయ‌క‌త్వానికి స‌మాచారం అందించారు. తాజాగా నిర్వ‌హించ‌న ఒక స‌ర్వేలో సైతం భీమిలో గంటాకు వ్య‌తిరేక ప‌రిస్థితులు ఉన్నాయ‌ని తేల‌టంతో..అవంతి మ‌రింత వేగంగా పావులు క‌దుపుతున్నారు. గంటాను రాజ‌కీయంగా దెబ్బ తీసేందుకు జిల్లాలోని మ‌రో టిడిపి ముఖ్య నేత వ‌ర్గం అవంతికి అండ‌గా నిలుస్తోంది.

ఇక‌, గంటా టిడిపి లో జ‌రుగు తున్న ప‌రిణామాల పై అధినేత వ‌ద్ద చ‌ర్చించాల‌ని డిసైడ్ అయ్యారు. త‌న‌కు త‌గిన హామీ ల‌భించ‌క‌పోతే రాజ‌కీయంగా కీల‌క నిర్ణయం గంటా తీసుకుంటార‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. దీంతో..వీరిద్దిర‌లో ఒక‌రే టిడిపిలో ఉండ‌టం …మ‌రొక‌రు వైసిపిలోకి వ‌చ్చేదెవ‌రు అనే విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కొద్ది రోజుల క్రితం వైసిపి నేత విజ‌య సాయి రెడ్డి సైతం విశాఖ‌లో త్వ‌ర‌లోనే టిడిపి నుండి కీల‌క నేత‌ల చేరిక‌లు ఉంటాయ‌ని వ్యాఖ్యానించ‌టం తో వైసిపి లో కొత్త చేరిక‌ల పై చ‌ర్చ జోరుగా సాగుతోంది. వ‌చ్చే నెల‌లో జ‌గ‌న్ పాద‌యాత్ర విశాఖ చేరిన త‌రువాత ప‌రిణామాలు మ‌రింత వేగంగా మారుతాయ‌ని..ఊహించ‌ని చేరిక‌ల‌కు పాద‌యాత్ర వేదిక అవుతుంద‌ని వైసిపి నేత‌లు చెబుతున్నారు.

స‌ర్వే తేల్చిన అసలు నిజం ఇదే..! -Real Facts behind The Yellow Media survey ||

0

ఆ స‌ర్వే తేల్చింది ఇదే..
స‌ర్వే వెనుక వాస్త‌వం ఇదేనా..!!

ఆ స‌ర్వే వాస్త‌వ రిపోర్ట్ ఏంటి. టిడిపి కి కొత్త టానిక్‌. జ‌గ‌న్ జ‌నాద‌ర‌ణ ఏం ప్ర‌భావం చూపించ‌టం లేద‌ని టిడిపి కేడ‌ర్ లో భ‌రోసా నింపాలి. అంతే..వెంట‌నే అనుకూల స‌ర్వేలు వ‌చ్చేస్తాయి. టిడిపి నేత‌లే న‌మ్మ‌లేని వాస్త‌వాలు ఆ స‌ర్వేలో వండి వార్చేస్తారు. ఇప్ప‌టికిప్పుడు ఏపిలో ఎన్నిక‌లొస్తే ఏం జ‌రుగుతోంది…అంటూ ఆంధ్ర‌జ్యోతి -ఆర్జీస్ ఫ్లాష్ టీం స‌ర్వే ఒక‌టి ప్ర‌చురించారు. వారి సర్వే ప్ర‌కార‌మే చూసినా..ఈ స‌ర్వేలో కొన్ని సందేహాలు నివృత్తి కావాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. తాజాగా ఆర్జీస్ ఫ్లాష్ టీం చేసిన స‌ర్వే ఏపిలో 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో చేసామ‌ని చెబుతున్నారు. ఎన్ని శాంపిల్స్ సేకరించింది స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. స‌ర్వే చేసిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు ఇవ్వ‌లేదు.

పాద‌యాత్ర ప్ర‌భావం లేద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. అదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం పాద‌యాత్ర సాగుతున్న తూర్పు గోదావ‌రి జిల్లాలోని అన‌ప‌ర్తి, రాజ‌మండ్రి లో వైసిపి కి అనుకూలంగా ఉంద‌ని చెప్పుకొచ్చారు. ఆ రెండు సిట్టింగ్‌లు వైసిపివి కావు. ఇక‌, ఓట్లు య‌ధాత‌ధం అంటూనే సీట్ల‌లో మాత్రం టిడిపికి అద‌నంగా మ‌రో ఎనిమిది వ‌స్తాయ‌ని వివ‌రించారు. కానీ, రెండు పార్టీల మ‌ధ్య ఓట్ల వృత్యాసం ఏడు శాతం అంటూనే జ‌నసేన‌కు 8.9 శాతం మంది జై కొట్టార‌ని పేర్కొన్నారు. 2014 ఎన్నిక‌ల్లో అధికారం-ప్ర‌తిప‌క్షం మ‌ధ్య ఓట్ల తేడా కేవ‌లం 1.95 శాతం. ఇక‌, బిజెపి పై ఉన్న వ్య‌తిరేక‌త గురించి ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఇదే స‌మ‌యంలో..గ‌తంలో 2016 న‌వంబ‌ర 29న ఇదే ఆంధ్ర‌జ్యోతి-ఆర్జీస్ ఫ్లాష్ టీం ప్ర‌చురించిన స‌ర్వేను గుర్తు చేసుకోవాలి. అప్పుడు టిడిపి ఒంట‌రిగా పోటీ చేస్తే టిడిపికి 46.47 శాతం ఓట్ల‌తో 140 సీట్లు వ‌స్తాయ‌ని నాడు పేర్కొంది. అదే సర్వేలో వైసిపికి 35.91 శాతం ఓట్ల‌తో 30 సీట్లు వ‌స్తాయ‌ని నాడు తేల్చింది. మ‌రి.. అప్ప‌టి కంటే ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగెంద‌వరికి. గ‌తంలో టిడిపి ఒంట‌రిగా పోటీ చేస్తే వ‌చ్చే ఓట్ల శాతం 46.47 కాగా, ఇప్పుటి స‌ర్వేలో వ‌చ్చింది 44.04 శాతం. అంటే టిడిపి ఓటింగ్ శాతం త‌గ్గింద‌ని స‌ర్వేనే తేల్చింది. ఇక‌, నాటి స‌ర్వేలో వైసిపికి 35.91 శాతం గా ఓటింగ్ శాతం నేటి స‌ర్వేలో 37.46 శాతానికి పెరిగింది. మ‌రి..ఎవ‌రి ఓటింగ్ శాతం పెరిగిన‌ట్లు. ఇక‌, నాడు జ‌న‌సేన‌కు 3.86 శాతంగా ఉన్న ఓట్ల శాతం..ఇప్పుడు 8.90 శాతానికి పెరిగింద‌ని తేల్చారు. ఇదే ఆంధ్ర‌జ్యోతి-ఆర్జీస్ ఫ్లాష్ టీం 2016 న‌వంబ‌ర్ లో చేసిన స‌ర్వే..తాజా స‌ర్వే మ‌ధ్య తేడా చూస్తే..ఇటువంటి సందేహాలు రాక మాన‌వు. దీనిని లోతుగా పరిశీలి స్తే..అస‌లు జ‌రుగుతుంది ఏంటో ఇట్టే అర్ద‌మైపోతుతంది. ఇక‌, ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉంది. మ‌రి..నిజంగా ప్ర‌జ‌ల్లో అంత‌గా బ‌లం ఉంటే..ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో రాజీనామాల‌కు..ఉప ఎన్నిక‌ల‌కు ఇంత కాలంగా అధికార పార్టీ ఎందుకు వెనుకాడుతుందో అర్దం కాని విష‌యం. ఇక‌, ఈ స‌ర్వేను లోతుగా అధ్య‌య‌నం చేసిన ప్ర‌తీ ఒక్క‌రు దీని పై కామెంట్ల రూపం లో స్పందించండి..

వైసిపి అభిమానులు న‌మ్మ‌లేని నిజాలు. – Bitter Facts YCP Fans should know

0

వైసిపి అభిమానులు న‌మ్మ‌లేని నిజాలు..
అధికారం ద‌క్కాలంటే కావాల్సింది ఇదే..
ycp లో  మారుతున్న స‌మీక‌ర‌ణాలు..

రంజుగా మారుతున్న గోదావ‌రి రాజ‌కీయం. అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టిస్తున్న జ‌గ‌న్‌. ఉభ‌య గోదావ‌రిలో కొత్త స‌మీర‌ణాలు.  గోదావ‌రి జ‌గ‌న్ నామ స్మ‌ర‌ణ‌తో ఘోషించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ఖాయ‌మ‌నే స‌మ‌ర‌నాదాన్ని మోగించింది. గోదావ‌రి జిల్లాల్లో సీన్ మారుతోంద‌ది. ఆ రెండు జిల్లాల్లో ఎవ‌రు గెలిస్తే వారిదే అధికారం అనేది అంద‌రి న‌మ్మ‌కం. జ‌గ‌న్ కు గోదావ‌రి జిలాల్లో వ‌చ్చిన అనూహ్య స్పంద‌న ప్ర‌తీ ఒక్క‌రిలో ఆలోచ‌న క‌లిగిస్తోంది. గోదావరి జిల్లాల్లో జ‌గ‌న్ ఎఫెక్ట్ తో అధికార పార్టీ పున‌రాలోచ‌న‌లో ప‌డింది. జ‌గ‌న్ పాద‌యాత్ర సమ‌యంలో ఒక న‌మ్మ‌కైన సంస్థ‌తో స‌ర్వే చేయించుకున్నారు. అందులో ఊహించ‌ని ఫ‌లితాలు వ‌చ్చాయి.

ఈ రెండు జిల్లాల్లో గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాన్ ప్ర‌భావం క‌నిపించింది. అదే టిడిపికి అధికారంలోకి రావ‌టానికి స‌హ‌క‌రించింది. ఇప్పుడు అదే అక్క‌డ రివ‌ర్స్ అవుతోంది. స‌ర్వేలో తేలిన విష య‌మూ అదే.స్వ‌త‌హాగా వ్య‌వ‌సాయం ప్ర‌ధాన వృత్తిగా ఉండే ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌ల్లో రుణ‌మాఫీ హామీ విస్మ‌రణ బాగా ప్ర‌భావం చూపుతోంది. జ‌గ‌న్ కు ఈ రెండు జిల్లాల్లో వ‌చ్చిన స్పంద‌న తో అక్క‌డ కాయ‌క‌ల్ప చికిత్స కు టిడిపి అధినాయ‌క‌త్వం రంగంలోకి దిగింది. కొల్లేరు పై దృష్టి సారించింది. ఆక్వా రైతుల‌కు విద్యుత్ రాయితీల పై నిర్ణ‌యం తీసుకుంది.

జ‌గ‌న్ గోదావ‌రి జిల్లాల్లో ఉండ‌గానే పోల‌వ‌రం పునాదుల‌ను జాతికి అంకితం అంటూ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నం చేసింది. అయినా..అదే రోజు జ‌గ‌న్ తూర్పు లో ఎంట్రీ తో గోదావ‌రి జ‌న గోదారిగా మారిపోయింది. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ఒక్క సీటు రాని ప‌శ్చిమ గోదావ‌రి లో వైసిపి లోకి చేరిక‌లు…పార్టీలో కొత్త జోష్ ను నింపుతున్నాయి. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో అయిదు సీట్లు ద‌క్కించుకున్న తూర్పులో ఎంట్రీ చూసిన త‌రువాత పార్టీని వీడిన నేత‌లు తిరిగి వైసిపిలోకి వ‌స్తామంటూ రాయ‌బారాలు న‌డుపుతున్నారు. కానీ, జ‌గ‌న్ స‌సేమిరా అంటున్నారు. ప్ర‌తీ ఒక్క వ‌ర్గాన్ని..ప్ర‌తీ ప‌రిశ్ర‌మ కు చెందిన వారిని క‌లుస్తూ..వారితో జ‌గ‌న్ మ‌మేకం అవుతున్నారు. ఇక‌, ఈ రెండు జిల్లాల్లో వ‌చ్చిన ఫ‌లితాల‌తోనే రాష్ట్ర స్థాయి లో అధికారం ద‌క్కుతుంద‌నే న‌మ్మ‌కం తో..జ‌గ‌న్ కు ధీటుగా అనేక నిర్ణ‌యాల‌తో ప్ర‌భుత్వం సిద్ద‌మ‌వుతోంద‌ది. కానీ, ఆ క్రెడిట్ సైతం జ‌గ‌న్ కే ద‌క్కుతుంద‌ని వైసిపి నేత‌లు న‌మ్ముతున్నారు. ఇక‌, వైసిపి నేత‌లు అంచ‌నా వేస్తున్న‌ట్లు గా..నిఘా వ‌ర్గాలు ఇస్తున్న నివేదిక‌లు ఆధారంగా చూస్తే..ఈ రెండు జిల్లాల్లో సీన్ మారిపోయిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది . ఇది..వైసిపి నిజంగా న‌మ్మ‌లేని నిజం. ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాన్ ప్ర‌భావం ఈ సారి ఏ విధంగా ఉంటుంద‌నే అంచ‌నాలు మొద ల‌య్యాయి. కానీ, జ‌గ‌న్ సృష్టించిన జ‌న సునామీ ని మించే స్థాయిలో మాత్రం ఉండ‌ద‌ని వైసిపి నేత‌లు గ‌ట్టిగా చెబుతు న్నారు. దీంతో..ఇప్పుడు గోదావ‌రి రాజ‌కీయం రంజుగా మారింది

సీన్ రివర్స్..దెబ్బ‌కు దెబ్బ‌. 2014 కు ప్ర‌తీకారం 2019 – Sean Rivers Revenge for 2014 is 2019 Elections

0

సీన్ రివర్స్..దెబ్బ‌కు దెబ్బ‌. 2014 కు ప్ర‌తీకారం 2019

దెబ్బ‌కు దెబ్బ‌. 2014 కు ప్ర‌తీకారం 2019. నాడు రాజ‌కీయంగా ఉమ్మ‌డి ప్ర‌త్య‌ర్ధి వైసిపి అధినేత జ‌గ‌న్‌. నేడు అంద‌రికీ రాజ‌కీయంగా టార్గెట్ టిడిపి అధినేత చంద్ర‌బాబు. నాడు జ‌గ‌న్ అధికారంలోకి రాకూడ‌దు. చంద్ర‌బాబు సీయం అవ్వాలి. ఇదే ల‌క్ష్యంతో అనేక స‌మీక‌ర‌ణాలు చోటు చేసుకున్నాయి. నేడు ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. అదే స‌మ‌యం లో ల‌క్ష్యం సైతం మారిపోయింది. నాడు టిడిపి కి మ‌ద్ద‌తుగా నిలిచిన ప‌వ‌న్ క‌ళ్యాన్‌..బిజెపి లు నేడు టిడిపి కి ప్ర‌త్య‌ర్ధులుగా మారిపోయారు. నాడు చంద్ర‌బాబు కోసం జ‌గ‌న్ ను విమ‌ర్శించిన వారే నేడు చంద్ర‌బాబు కంటే బెట‌ర్ అంటున్నారు.  నాడు జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా ఉన్న వారంద‌రినీ టిడిపి అక్కున చేర్చుకుంది. నేడు అదే చంద్రబాబుకు వ్య‌తిరేకంగా మారు తున్న‌వారంతా జ‌గ‌న్ కు జై కొడుతున్నారు. .కానీ, .అప్పుడూ..ఇప్పుడూ తేడా ఒక్క‌టే. జ‌గ‌న్ అవ‌కా శ‌వాద రాజ‌కీయాలు చేయ‌లేదు. ప్రోత్స‌హించ‌లేదు. 2014 ఎన్నిక‌ల ముందు స‌బ్బం హ‌రి జ‌గన్ కు వ్య‌తిరేకంగా మాట్లాడారు. వెంట‌నే టిడిపి నేత‌లు ఆయ‌న్ను విశాఖ లో విజ‌య‌మ్మ ప‌రాజ‌యానికి పావుగా వాడుకున్నారు. ఇప్పుడు తెలంగాణ నేత మోత్కుప‌ల్లి టిడిపి అధినేతకు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పారు. జ‌గ‌న్ పాద‌యాత్ర లో సైతం పాల్గొని మ‌ద్ద‌తిస్తానని ప్ర‌క‌టించారు.

ఏ ప‌వ‌న్ క‌ళ్యాన్ అయితే జ‌గ‌న్ పై 2014 లో ఆరోప‌ణ‌లు చేసారో..ఇప్పుడు వాస్త‌వాలు తెలుసుకొని చంద్ర‌బాబు క్యాంపు అవినీతి పై ఫైర్ అవుతున్నారు. ఇక‌, బిజెపి నేత‌లు సైతం గ‌తంలో చంద్ర‌బాబు ను ఆకాశానికి ఎత్తేసారు. ఇప్పుడు అస‌లు విష‌యం బోధ‌ప‌డిన త‌రువాత టిడిపి ప్ర‌భుత్వంలో అవినీతి పై మాట్లాడుతున్నారు. ఇక‌, జ‌గ‌న్ పాద‌యాత్ర ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగానే సమ‌ర‌శంఖం పూరించారు. సామాజిక స‌మీక‌ర‌ణాల్లో జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నారు. కొన్ని చోట్ల అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. అమ‌లు చేసే అవ‌కాశం ఉన్న హామీల‌నే ప్ర‌క‌టిస్తూ వాటిని ఏ ర‌కంగా అమ‌లు చేసేదీ వివ‌రిస్తున్నారు. స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ..ఓపిక తో అంద‌రి బాధ‌లు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎలాగైనా 2014 కు దెబ్బ దెబ్బ తీయాల‌నేది జ‌గ‌న్ ల‌క్ష్యం. అందులో భాగం గానే అడుగులు ప‌డుతున్నాయి. ఏనాడు ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేయ‌ని టిడిపి..ఈ సారి దాదాపు ఒంట‌రి పోరుకే దిగాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంఇ. అయితే, బ‌హుముఖ పోరులో త‌మ‌కు క‌లిసి వ‌స్తుందనే అంచ‌నాలు వేస్తోంది. కానీ, త‌న ఓటు బ్యాంకు తో పాటుగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును వైసిపి న‌మ్ముకుంటుంది. అయితే, పోల్ అండ్ పొలిటిక‌ల్ మేనేజ్ మెంట్ లో మాత్రం వైసిపి అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే. అదే జ‌రిగితే..ఇక జ‌గ‌న్ ల‌క్ష్యం ఎంతో దూరంలో లేద‌నేచెప్పుకోవాలి. అందుకు ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో వ‌స్తున్న శుభ సూచిక‌లే కార‌ణం.